Andhra Pradesh: ఛీ..ఛీ.. రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ మానవత్వాన్ని మంటగలిపారు.. పోస్టుమార్టం కోసం..

Machilipatnam Hospital News: అసలే ఎలా చనిపోయాడో దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బంధువులకు పెద్ద కష్టం వచ్చిపడింది.. మానవత్వం మరిచిన ప్రభుత్వ వైద్యులు.. డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం లంచం డిమాండ్ చేశారు.

Andhra Pradesh: ఛీ..ఛీ.. రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ మానవత్వాన్ని మంటగలిపారు.. పోస్టుమార్టం కోసం..
Machilipatnam Government Hospital
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2023 | 8:28 AM

Machilipatnam Hospital News: అసలే ఎలా చనిపోయాడో దిక్కుతోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బంధువులకు పెద్ద కష్టం వచ్చిపడింది.. మానవత్వం మరిచిన ప్రభుత్వ వైద్యులు.. డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం లంచం డిమాండ్ చేశారు. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నం ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యులు మానవత్వం మరిచి హద్దుదాటి ప్రవర్తించారు. అసలే బంధువును పోగోట్టుకొని పుట్టేడు దుఃఖంలో ఉన్న బంధువులను లంచం డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం చేయాలంటే 10వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే పోస్ట్ మార్టం చేసేదే లేదంటూ ఆర్‌ఎంవో మహేష్, డాక్టర్ ఆంజనేయులు ఖరాఖండిగా చెప్పారంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు లంచం ఇచ్చుకోలేక.. మార్చురీ దగ్గర గంటల తరబడి పడిగాపులు కాశారు.

మృతుడు మచిలిపట్నం లోని బలరామున్న పేటకు చెందిన ఎద్దు సత్యనారాయణగా గుర్తించారు. మరోవైపు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు పోస్ట్ మార్టం అసిస్టెంట్ శ్రీనివాస్. లంచం విషయంలో తన పాత్ర ఏమి లేదని, అధికారి ఆదేశానుసారం వారు చెప్పింది మాత్రమే తాను చేశానని చెప్పారు శ్రీనివాస్. అధికారులు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఆసుపత్రిలోనే పురుగుల మందు కూల్ డ్రింక్ లో కలుపుకుని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం శ్రీనివాస్ కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..