AP Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. రాబోయే మూడు రోజులు ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి..

దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంపై వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తదుపరి 48 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులు వాతావరణ సూచనలు..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:– ఈ రోజు, రేపు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ఈ రోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ:- ఈ రోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీవ్యాప్తంగా చలి తీవ్రత పెరగనుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడు లేదా నాలుగు రోజులు ఉదయం వేళలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయని.. కొన్ని ప్రదేశాల్లో పొగమంచుతో కూడిన తేమ వాతావరణ చూడొచ్చునని పేర్కొన్నారు.
