Andhra Pradesh: జల్లికట్టు జోష్‌ షురూ.. ఆ ప్రాంతంలో జోరుగా పోటీలు.. ఆంక్షలున్నా కానీ..

సంక్రాంతి వచ్చేసింది. సంబరాలు తెచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామాల్లో జల్లికట్టు ఫీవర్‌తో వేడెక్కిపోయింది. పలుచోట్ల జల్లికట్టు సంబరాలు ఘనంగా ప్రారంభమమయ్యాయి. పశువులను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు పలకలు కట్టారు. జల్లికట్టు కోసం ఎద్దులు కట్లు తెంచుకుని రంకెలు పెట్టాయి. ఇక పొగరుబోతు గిత్తల కొమ్ములు వంచి తమ సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు యువకులు.

Andhra Pradesh: జల్లికట్టు జోష్‌ షురూ.. ఆ ప్రాంతంలో జోరుగా పోటీలు.. ఆంక్షలున్నా కానీ..
Representative Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2024 | 5:40 PM

సంక్రాంతి వచ్చేసింది. సంబరాలు తెచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామాల్లో జల్లికట్టు ఫీవర్‌తో వేడెక్కిపోయింది. పలుచోట్ల జల్లికట్టు సంబరాలు ఘనంగా ప్రారంభమమయ్యాయి. పశువులను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు పలకలు కట్టారు. జల్లికట్టు కోసం ఎద్దులు కట్లు తెంచుకుని రంకెలు పెట్టాయి. ఇక పొగరుబోతు గిత్తల కొమ్ములు వంచి తమ సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు యువకులు.

జల్లికట్టు అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది తిరుపతిజిల్లా చంద్రగిరి. ఈ నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామంలో భోగి తొలిరోజే జల్లికట్టు ఆటలు జోరుగా జరుగుతున్నాయి. పోలీసుల ఆంక్షలను సైతం పట్టించుకోకుండా ఎన్ని ఆంక్షలున్నా…ఈ సంక్రాంతి నాలుగు రోజులు ఎద్దులతో పోటీ పడతారు ఇక్కడి యువకులు.

అనపల్లి గ్రామంలో జరిగే జల్లికట్టు ఉత్సవంలో వందల సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అందంగా అలంకరించిన పశువులు పరుగెత్తుకుంటూ వస్తే వాటిని లొంగదీసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. కొన్ని గిత్తలను లొంగదీస్తే.. మరికొన్ని యువకులను కొమ్ములతో కుమ్మేశాయి. దాంతో పలువురికి గాయాలయ్యాయి.

జల్లికట్టు కోసం కొందరు యాజమానులు కాలుదువ్వి రంకెలు వేసేలా ఎద్దులకు శిక్షణ ఇస్తున్నారు. వాటిని పట్టుకుని ఆపే మగాడే లేడని, దమ్ముంటే ఆపాలంటే ఛాలెంజ్‌ చేసి ప్రైజ్ మనీలు కూడా పెడుతున్నారు. ఇక కొందరు నేతలు , అభిమాన హీరోల ఫోటోలతో పలకలు పెట్టి పశువులను పరిగెత్తిస్తున్నారు. ఒక్క చంద్రగిరి మండలంలోనే అనేక గ్రామాల్లో జల్లికట్టు పోటీలు పెద్ద పెద్దయెత్తున జరుగుతున్నట్లు సమాచారం.

సంక్రాంతి పండుగకి కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేలకు దీటుగా చిత్తూరు జిల్లాలో ఎద్దులతో జల్లికట్టు నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది కూడా జల్లికట్టులో పలువురు యువకులకు స్వల్పగాయాలయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..