Andhra Pradesh: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుదిరిన సర్దుబాటు.. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారంటే..?
సస్పెన్స్‌కు తెరపడింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ ఖాయమైంది. ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ రోజు 11 గంటలకు అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి.
సస్పెన్స్‌కు తెరపడింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయేలోకి టీడీపీ రీ ఎంట్రీ ఖాయమైంది. ఈ అంశంపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ రోజు 11 గంటలకు అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ అమిత్ షాతో చర్చించారు. బీజేపీకి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబు ముందుంచినట్టు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయిన నేపథ్యంలో.. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది.
బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో జరిగిన ఈ కీలక చర్చల్లో బీజేపీకి ఇవ్వనున్న లోక్‌సభ సీట్లపై ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సీట్ల అంశంపై అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో చర్చించాలని, బీజేపీ పరిశీలకులు, రాష్ట్ర బీజేపీ చీఫ్‌తో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకం అంశంపై కాసేపట్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రకటన చేయబోతుంది. సీట్ల సర్దుబాటు వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో మార్చి 14వ తేదీన జరగబోయే ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులు కుదరడంతో.. సీట్ల పంపకం ఏ విధంగా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఏయే సీట్లు కమలం పార్టీకి ఇస్తారనే దానిపై ఉత్కంఠ మొదలైంది. సీట్ల పంపకంపై టీడీపీ, జనసేన ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయి. పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. 94 సీట్లకు టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో మిగిలిన సీట్లలోనే బీజేపీకి సర్దుబాటు చేస్తారా ? లేక మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..