AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..

ఓ భర్త చేసిన అప్పు.. భార్యకు ముప్పుగా మారింది.. ఓ వ్యక్తి దగ్గర భర్త అప్పు తీసుకుని తీర్చలేక పారిపోయాడు.. ఐతే సకాలంలో అప్పు చెల్లించలేదని ఇప్పటికిప్పుడు డబ్బులు ఇస్తావా లేదా అంటూ మహిళను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటన కుప్పంలో జరిగింది.

Andhra: భర్త చేసిన అప్పు.. కట్ చేస్తే.. ఆపై మహిళను చెట్టుకు కట్టేసి.. చెంపదెబ్బలు కొట్టి..
Kuppam
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2025 | 10:39 AM

Share

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురంలో అప్పు వసూలు చేసేందుకు మహిళను చెట్టు కట్టి, దాడి చేయడం కలకలం రేపింది. నారాయణపురానికి చెందిన మునికన్నప్ప దగ్గర తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే తిమ్మరాయప్ప ఈ అప్పుల భారం భరించలేక ఊరు వదిలేసి వెళ్లిపోయారు. అయితే రాయప్ప భార్య శిరీష తన పుట్టింటికి వెళ్లిపోయింది.. శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కొడుకును పోషిస్తున్నారు. శిరీష కుమారుడు స్కూల్లో చదువుతుండటంతో ఆమె నారాయణపురం వచ్చారు.. అక్కడ స్కూల్లో టీసీ తీసుకునేందుకు వెళ్లగా.. ఈ విషయం మునికన్నప్పకు తెలియడంతో అతడి భార్య, కొడుకు, కోడలు అక్కడికి వెళ్లారు. తిమ్మరాయప్ప అప్పు కింద తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు. శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశారు.. ఐతే మునికన్నప్ప మహిళలను చెట్టుకు కట్టేసి దాడి చేస్తున్న టైమ్‌లో కొందరు వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడులకు దిగారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఆ మహిళను విడిపించగా.. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మునికన్నప్పపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. అటు నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు జిల్లా ఎస్పీ. మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ