Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!

Former YSRCP MLA Chevireddy Bhaskar Reddy Arrest: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మంగళవారం (జూన్‌ 17) అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు..

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌.. నేడు కోర్టు ముందు హాజరు!
Former YSRCP MLA Chevireddy Bhaskar Reddy
Srilakshmi C
|

Updated on: Jun 18, 2025 | 6:23 AM

Share

అమరావతి, జూన్‌ 18: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మంగళవారం (జూన్‌ 17) అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను బెంగళూరులోని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఏపీ పోలీసులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అప్పగించారు. అక్కడి నుంచి మూడు వాహనాల్లో బెంగళూరు నుంచి మంగళగిరికి తరలించేందుకు ఏపీ పోలీసులు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్ పోర్ట్ కూడా ఏపీ పోలీసులకు.. కర్ణాటక పోలీసులు అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకలోని కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు మంగళవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఎయిర్‌ పోర్టు పోలీస్ స్టేసన్‌కు తరలించారు. కాగా ఏపీలో మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు 200 మందికిపైగా సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో సిట్‌ అధికారులు బాస్కర్‌ రెడ్డిని ఏ-38గా పేర్కొంది. ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాల్యమిత్రుడు, సన్నిహితుడైన వెంకటేశ్‌ నాయుడినీ సిట్‌ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-34గా వెంటేశ్‌ నాయుడిని సిట్‌ చేర్చింది. చెవిరెడ్డి, వెంకటేశ్‌ నాయుడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్లు ఉండడంతో వీరిద్దరినీ బెంగళూరు ఎయిర్‌పోర్టు సిబ్బంధి నిర్బంధించి, ఆ సమాచారాన్ని సిట్‌ అధికారులకు తెలియజేశారు. సిట్‌ బృందాలు బెంగళూరు వెళ్లి, బుధవారం వేకువజామున వారిద్దరినీ అరెస్టు చేశాయి. చెవిరెడ్డి, వెంకటేశ్‌ నాయుడి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిది మందికి చేరింది. బుధవారం చెవిరెడ్డి, వెంకటేశ్‌ నాయుడి విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి, అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మనిషైనా.. జంతువైనా.. పెళ్ళానికి భయపడాల్సిందే
మనిషైనా.. జంతువైనా.. పెళ్ళానికి భయపడాల్సిందే
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా