Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం.. ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలపై దాడి!

శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికల్లో కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు.. సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Leopard In Srisailam
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 26, 2024 | 10:13 AM

శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికల్లో కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు.. సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి రాత్రి సమయాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా అర్ధరాత్రి సమయంలో కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. చిరుతపులి సంచారంతో స్దానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో చిరుతపులి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామం పరిధిలోని రామాలయం ఆలయం సమీపంలో చిరుతపులి జనసంచారంలోకి వచ్చింది. ఓ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కులపై దాడి చేసింది. ఇంటి ఆవరణలోకి వచ్చిన చిరుత కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమారాల్లో రికార్డ్ అయ్యాయి. కుక్కల అరుపులు విన్న యజమాని, చిరుతపులి చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీ ఫుటేజీ పరిశీలించిన అటవీ సిబ్బంది గాలింపు చేపట్టారు. రెండు కుక్కలపై దాడి చేసిన చిరుత, ఒక కుక్కను చంపి, మరో కుక్కను నోటితో పట్టుకుని ఎత్తుకెళ్ళింది. ఈ దృశ్యాలు శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో చోటు చేసుకుంది. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంతో అటవీశాఖ సిబ్బంది గ్రామంలోని ప్రజలతోపాటు శ్రీశైలం వచ్చే భక్తులను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!