AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani : బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో ఏం జరిగేదో చెప్పిన మంత్రి కొడాలి నాని

Kodali Nani : తిరుపతి బై ఎలక్షన్లో దొంగ ఓట్లు పడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు..

Kodali Nani : బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో ఏం జరిగేదో చెప్పిన మంత్రి కొడాలి నాని
Venkata Narayana
|

Updated on: Apr 19, 2021 | 3:08 PM

Share

Kodali Nani : తిరుపతి బై ఎలక్షన్లో దొంగ ఓట్లు పడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80 శాతం లేదా 90 శాతం జరిగి ఉండాలన్నారు. కాని అలా జరగ లేదని మంత్రి చెప్పుకొచ్చారు. తిరుపతి ఎన్నికలలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందన్న ఆయన, 4 లక్షల 50 వేల మెజారిటీ ఓట్లతో వైసీపీ ఎంపీ సీట్ కైవసం చేసుకోవడం జరుగుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చేయడం అంటే.. లాక్ డౌన్ పెట్టడం పరిష్కారం కాదని, ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇలా ఉండగా, ఏపీ సచివాలయంలో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది.  వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.

సచివాలయ ఉద్యోగుల మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణమని ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Read also :  MLA Roja : తిరుపతిలో ఓటమికి కారణాలు వెతుక్కునేపనిలో టీడీపీ దొంగ ఓట్ల డ్రామా ఆడుతోంది : వైసీపీ ఎమ్మెల్యే రోజా