ఐదు రోజుల వ్యవధిలో అమ్మనాన్నల మృతి..అనాధలైన ముగ్గురు ఆడపిల్లలు
ఈ నెల 16న తండ్రి అనారోగ్యంతో మృతి. ఈనెల 21న మనోవేదనతో తల్లి మృతి. మాటలకు అందని మహా విషాదం అంటే ఇదేనేమో. ముగ్గురు ఆడపిల్లలను వదిలి శాశ్వతంగా వెళ్లిపోయిన తల్లిదండ్రుల గురించి ముగ్గురు ఆడపిల్లలకు కన్నీరు ఆగడం లేదు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన మహాదేవప్ప (50) ది అత్యంత నిరుపేద కుటుంబం. ఈయన భార్య పేరు రంగమ్మ. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మౌనిక శ్యామల లను డిగ్రీ వరకు చదివించారు. భూమిక ఇంటర్ వరకు చదివారు. అప్పటికే అప్పులు పెరగడంతో పిల్లల చదువు ఆగిపోయింది. కూలీ పనులకు వెళ్తున్నారు. పైగా తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారు.
మహాదేవప్ప భార్య గంగమ్మకు క్యాన్సర్ మహమ్మారి సోకింది. భార్యకు చికిత్స చేయించలేక భర్త మనోవేదనకు గురయ్యాడు. జీవితంలో అలసిపోయాడు. గుండెపోటుతో ఈ నెల 16న మృతి చెందాడు. ఆ కుటుంబానికి షాక్ తగిలినట్లుంది. ఎలాగోలా తీవ్ర విషాదంతో కన్నీటి పర్యంతంతో ఆడపిల్లలే తండ్రి అంత్యక్రియలు ముగించారు. కేన్సర్ తో పోరాడుతున్న తల్లి రంగమ్మ మరింత కుంగిపోయింది.
భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది. అతడు చనిపోయిన ఐదవ రోజే అంటే ఈ నెల 21న మృత్యువాత పడింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రి తల్లి మృతి చెందడంతో ఆ పిల్లల మనసులు కకావికలమయ్యాయి. కన్నీటిని ఆపుకోలేక ఉన్నారు. ఇక తమకు దిక్కెవరు, ఎవరు పోషించాలి, పెళ్లిళ్లు ఎవరు చేయాలి అనుకుంటూ మనసులో బాధను దిగమింగుకుంటున్నానరూ. ఓదార్చేవారు భరోసా ఇచ్చే వారి కోసం ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








