Srisailam: శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ
ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీస్వామి అమ్మవారి ఆలయాల ప్రధానార్చకులు ఆలయ ఏఈవో హరిదాసు పలువురు అర్చకులు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపి బోనాన్ని సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శ్రీశైల మహాక్షేత్రం గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం ఘనంగా బోనం సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం దేవస్థానం తరుఫున బోనాలు సమర్పించడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీస్వామి అమ్మవారి ఆలయాల ప్రధానార్చకులు ఆలయ ఏఈవో హరిదాసు పలువురు అర్చకులు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపి బోనాన్ని సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, జనులందరూ సంతోషంగా ఉండాలని సుఖసంతోషాలు, సంకల్పము పఠించి అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరిదాసు, అర్చకస్వాములు, వేదపండితులు కలిసి సంప్రదాయబద్ధంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలాలు, పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..