Byreddy: రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒట్టి బోగస్.. అది సీమ కోసం కాదు.. అంతా మోసం : బైరెడ్డి
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒట్టి బోగస్.. అది సీమ కోసం కాదు.. అంతా మోసం అని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బైరెడ్డి ఆరోపించారు...
Byreddy – Rayalaseema – Irrigation Projects: రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒట్టి బోగస్.. అది సీమ కోసం కాదు.. అంతా మోసం అని బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బైరెడ్డి ఆరోపించారు. రిజర్వాయర్‌లు లేకుండా, ఉన్న వాటి కెపాసిటీ పెంచకుండా ప్రాజెక్ట్‌లు కడుతామంటే ఎవరూ నమ్మరు.. ఇది కేంద్రంలోని బిజెపి గుర్తించింది అని ఆయన అన్నారు.
నీటి విషయంలో సీమకు వైసిపి, టిడిపిలు మోసం చేస్తున్నట్లు బిజెపి గుర్తించిందన్న బైరెడ్డి.. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 854 మెయింటైన్ చేయకుంటే సీమ ఎడారి అవుతుందన్నారు. “854 అడుగులు నీటిమట్టం వచ్చేవరకు పవర్ ప్రొడక్షన్ వద్దు.. సీమ అభివృద్ధి ఒక్క ప్రధాని మోడీ తోనే సాధ్యం.. ఇందుకోసమే కృష్ణా పరివాహక ప్రాజెక్ట్‌లు KRMP పరిధిలోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం.. అందుకు మోడీని అభినందిస్తూ ఉన్నాము.” అని బైరెడ్డి అన్నారు.
“సీమలో రిజర్వాయర్లు నిర్మిస్తేనే భవిష్యత్ ఉంటుంది.. కెసిఆర్ అంతగా మాట్లాడుతుంటే ఏపీ వాళ్ళు మాట్లాడక పోవడం దారుణం. షర్మిల మాట్లాడటానికి స్క్రిప్ట్ అమరావతి నుంచి తయారవుతోంది. ప్రాజెక్ట్‌లలో జరుగుతూ ఉన్న అవినీతి KRMP ద్వారా కంట్రోల్ అవుతుంది. సుంకేసుల రిజర్వాయర్ కెపాసిటీ పెంచకుండా, గుందేవుల ప్రాజెక్ట్ కట్టకుండా సీమని మోసం చేస్తున్నారు.” అని బైరెడ్డి చెప్పుకొచ్చారు.