వింత ఆచారం.. శరీరంపై తేళ్లను పాకించుకుంటున్న భక్తులు.. ఎక్కడో తెలుసా?
ఇక్కడ కొంత మంది కొండపై ఎదో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నారు కాదా.. వాళ్ల అంతా దేనికోసం వెతుకుతున్నారో తెలుస్తే మీరు షాక్ అవుతారు.. ఎందుకంటే వాళ్లందరూ వెతుకుతున్నది తేళ్ల కోసం. అవును మీరు విన్నిది నిజమే.. వాళ్లు వెతికేది తేళ్ల కోసమే.. తేళ్లను పట్టుకొని వీళ్లేమి చేస్తారని ఆశ్చర్య పడుతున్నారా.. తెలుసుకుందాం పదండి.

కర్నూలు జిల్లా కోడుమూరు కొండపై వెలసిన శ్రీ కొండల రాయుడు స్వామికి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయిథిగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకత దినం. ఆరోజు స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే తేళ్లను చేతుల పైన, తలపైన, ముఖం పైన, చివరికి నాలుక పైన పెట్టుకుంటారు. అయితే ఈ అలా చేసేప్పుడు తేళ్లు కుట్టినా.. ఆ ఒక్కరోజు వాళ్లకు ఏమి కాదట.. ఒక వేల తేలు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు.. నొప్పి ఆటోమెటిక్‌గా మాయమవుతుందట.
అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది!
పూర్వం 1970వ సంవత్సరం కోడుమూరులో సౌరెడ్డి, అన్నపూర్ణమ్మ అనే దంపతులు ఉండే వారు. అయితే వీళ్లకు ముగ్గురు ఆడ సంతానం ఉండడంతో మగసంతానం కోసం ఎందరో దేవుల్లను మొక్కారు. అలాగే కొడుమూరు కొండపై ఉన్న కొండల రాయుడుకి కూడా తాను అనుకున్నట్టు మగ సంతానం పుడితే కొండరాయుడికి గుడి కట్టిస్తానని.. తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తామని మొక్కుకున్నారు. అనుకున్నట్టే ఆ దంపతులు మగ బిడ్డకు జన్మనిచ్చారు.
దీంతో సౌరెడ్డి, అన్నపూర్ణమ్మ దంపతులు కొండల రాయుడికి కొండపైన గుడి కట్టించి, స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో పుట్టిన బిడ్డ కావడంతో ఆ బిడ్డకు మనోహర్ రెడ్డి అని నామకరణం చేశారు. అప్పటినుండి కోడుమూరు నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తేళ్లను నైవేద్యంగా స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో మూడవ సోమవారం కొండల రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించే సమయంలో ముందు రోజు గానీ, అదే రోజు గానీ వర్షాలు తప్పకుండా కురుస్తాయి. అందుకని నెల రోజులు వర్షం లేకున్నా ఈ రెండు రోజుల్లో వర్షాలు తప్పకుండా కురవడం విశేషంగా భావిస్తున్నారు ఇక్కడ భక్తులు. కొండలరాయుడు అంటే శ్రీవెంకటేశ్వర స్వామి అని.. స్వామి కొండపై ఏ చిన్న రాయిని వెలికి తీసిన తేళ్లు దర్శనమిస్తాయని స్థానిక భక్తులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
