AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రూ.45 లక్షల మద్యం బాటిళ్ల ధ్వంసం.. రోడ్డు రోలర్‌ ఎక్కించి మరీ..

Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా అవుతోంది. ముఖ్యంగా కర్ణాటక మద్యాన్ని అక్రమదారులు కొత్త కొత్త మార్గాల్లో

Andhra Pradesh: రూ.45 లక్షల మద్యం బాటిళ్ల ధ్వంసం.. రోడ్డు రోలర్‌ ఎక్కించి మరీ..
Liquor Destroy
Basha Shek
|

Updated on: Jul 24, 2022 | 4:35 PM

Share

Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం సరఫరా అవుతోంది. ముఖ్యంగా కర్ణాటక మద్యాన్ని అక్రమదారులు కొత్త కొత్త మార్గాల్లో రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు రోడ్డు రోలర్లు, జేసీబీలతో ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేస్తూ అక్రమ మద్యం సరఫరాపై గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా రాయలసీమ ముఖద్వారామైన కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఆలూరు –మొలగవల్లి గ్రామల మధ్య పట్టుబడ్డ అక్రమ మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. గతేడాది నుంచి ఈ మార్గంలో స్వాధీనం చేసుకున్న దాదాపు 35 నుంచి 40 లక్షల రూపాయల మద్యం బాటిళ్లను ప్రొహిబిషన్‌, స్థానిక SEB పోలీసులు రోడ్డు రోలర్‌ సహాయంతో ధ్వంసం చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారు చేయడం, విక్రయించడం నేరమని అటువంటి వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ పోలీసులు అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. చెక్​పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
ఒకే ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు మెయిడెన్లే.. టీ20ఐల్లో డేంజరస్ వీళ్లు
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
కేంద్ర బడ్జెట్‌ 2026 లైవ్‌ అప్‌డేట్స్‌.. లైవ్ వీడియో
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
ఐపీఎల్ తోపులు.. కట్ చేస్తే.. సిల్లీ రీజన్‌తో బ్యాన్..
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అరుదైన నాలుగు రాజయోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం, డబుల్ జాక్‌పాట్
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
చిరు vs బాలయ్య.. 2023 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కాబోతోందా?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
నిర్మలమ్మ బడ్జెట్ చీర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
5 వేలతో మొదలై 900 కోట్లకు.. ఇన్‌స్పైరింగ్ జర్నీ ఆఫ్ ఐశ్వర్యారాయ్
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
అదృష్టమే అదృష్టం.. మరో రెండు రోజుల్లో కోటీశ్వరులయ్యేది వీరే!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!
తల్లయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకున్న స్టార్ హీరోయిన్!