Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మట్టిలో మాణిక్యం తల్లీ నువ్వు.. కష్టాలను దాటుకుని.. సత్తా చాటింది

పేదరికాన్ని జయించే సాధనం ఏదైనా ఉంది అంటే మాత్రం అది చదువు మాత్రమే. చదువు మీ భవితని మారుస్తుంది. అందమైన భవిష్యత్‌ని ఇష్తుంది. మీకు సమాజంలో గౌరవాన్ని, హోదాని ఇస్తుంది. కొన్నేళ్లు చదవును ఇష్టపడితే.. అది జీవితంలోని కష్టాలు అన్నింటినీ మాయం చేస్తుంది.

AP News: మట్టిలో మాణిక్యం తల్లీ నువ్వు.. కష్టాలను దాటుకుని.. సత్తా చాటింది
Boya Naveena
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2024 | 11:50 AM

ఏప్రిల్ 22, సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు అసమాన ప్రతిభ కనబర్చారు. కుటుంబ నేపథ్యం సహకరించకపోయినా.. విధికి ఎదురీది అత్యథిక ఉతీర్ణత శాతంతో.. తమ ప్రతిభను చాటారు. మన నుంచి ఎవరు ఏదైనా దోచుకోగలరేమో కానీ, చదువు మాత్రం ఎవరూ దోచుకోలేరు. పేద బ్రతుకులు మారాలన్నా, భవిష్యత్ బాగుండాలన్నా చదువు ఉంటే చాలు. అందుకేనేమో ఈ మట్టిలో మాణిక్యం.. వారంలో 3 రోజులే బడికి పోయినా చదువుల్లో మాత్రం టాపర్‌గా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. కూలి పనులకు వెళ్తే రోజు గడవని జీవితం ఆ కుటుంబానిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలుకు చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె బోయ నవీన టెన్త్ క్లాస్, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి కిడ్నీ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఇంటి పరిస్థితి నేపథ్యంలో నవీనకు.. కుటుంబం నడవడం కోసం పనికి పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే స్కూల్‌కి వెళ్తోంది. చిప్పగిరి హైస్కూల్‌లో చదువుతున్న ఈ విద్యార్థిని.. ఇబ్బంది, పట్టుదలను చూసి ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేశారు. ఫీజులకు కొంత సాయం చేస్తూ, కావాల్సిన బుక్స్ అందిస్తూ.. చేయూతనిచ్చారు. దీంతో నవీన దొరికిన తక్కువ సమయంలోనే బాగా ప్రిపేర్ అయింది.  సోమవారం వచ్చిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి గ్రేట్ అనిపించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…