Sand Reach: ఎట్టకేలకు చెవిటికల్లు ఇసుక రీచ్ దగ్గర 24 గంటలుగా కొనసాగిన టెన్షన్‌కి తెర.. ఎలా?

24 గంటలకుపైగా వరదలోనే ఉన్న.. వందకుపైగా లారీలు ఎట్టకేలకు బయటపడ్డాయి. నీటి ప్రవాహం పెరగక ముందే లారీల్ని ఒడ్డుకు చేర్చేందుకు

Sand Reach: ఎట్టకేలకు చెవిటికల్లు ఇసుక రీచ్ దగ్గర 24 గంటలుగా కొనసాగిన టెన్షన్‌కి తెర.. ఎలా?
Chevitikallu 2
Follow us

|

Updated on: Aug 15, 2021 | 5:39 PM

Chevitikallu Sand Reach: 24 గంటలకుపైగా వరదలోనే ఉన్న.. వందకుపైగా లారీలు ఎట్టకేలకు బయటపడ్డాయి. నీటి ప్రవాహం పెరగక ముందే లారీల్ని ఒడ్డుకు చేర్చేందుకు చెవిటికల్లు ఇసుక రీచ్‌ దగ్గర దాదాపు NDRF, DRF బృందాలు విస్తృతంగా శ్రమించాయి. రోపులు, క్రేన్ల సాయంతో ఒక్కో లారీని నీళ్లలోంచి బయటపడేశాయి.

ఇవాళ ఎట్టకేలకు కృష్ణా జిల్లా చెవిటికల్లు ఇసుక రీచ్ దగ్గర గత నిన్నటి నుంచి కొనసాగుతోన్న టెన్షన్‌కి తెరపడింది. 132 లారీలు వరదనీటిలో చిక్కుకోవడంతో డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు భయాందోళనకు గురయ్యారు. మొత్తానికి వాళ్లందరిని సేఫ్‌గా ఒడ్డునపడేసినప్పటికి .. లారీలు వరదలోనే చిక్కుకుపోయాయి.

Chevitikallu 1

నిన్నటి నుంచి ఇవాళ్టి వరకు కొద్దిగా వరద ప్రవాహం తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్రేన్‌లకు రోప్‌లు కట్టి నిదానంగా లారీలను లాగారు. మొదట్లో ఇసుకలో కురుకుపోవడం వల్ల రెండు రోప్‌లు తెగిపోయినప్పటికి.. కొద్ది సేపటి క్రితం మొత్తం లారీలను ఒడ్డుకు చేర్చాయి NDRF, DRF బృందాలు.

Read also: Ramya Murder: ‘బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు’: లోకేష్