AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: అపోహ, అనుమానాలతో ఓ ఇంటి ఓనర్‌ అమానుషం.. ఆమె పాలిట శాపం. నెల్లూరులో ఘోరం

మానవత్వం ఇంకా అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో బతికే ఉందని భావిస్తున్నాం. కాని కొందరు మూర్ఖులు మాత్రం అపోహలు, అనుమానాలతో.. తోటి మనుషుల్ని

Nellore: అపోహ, అనుమానాలతో ఓ ఇంటి ఓనర్‌ అమానుషం.. ఆమె పాలిట శాపం. నెల్లూరులో ఘోరం
Nellore
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 15, 2021 | 5:29 PM

House owner in Nellore: మానవత్వం ఇంకా అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో బతికే ఉందని భావిస్తున్నాం. కాని కొందరు మూర్ఖులు మాత్రం అపోహలు, అనుమానాలతో.. తోటి మనుషుల్ని అంటరాని వాళ్లలా చూస్తూనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గి చాలా రోజులైంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతగా లేవు. కాని ఆ ఇంటి ఓనర్‌ అనుమానం అద్దెకి ఉంటున్న వృద్ధురాలి పాలిట శాపంగా మారింది. ఫలితంగా సాక్షాత్తూ.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఓ వృద్ధురాలు ఇల్లుండి దిక్కులేని దానిలా రోడ్డుపడింది.

వృద్ధురాలి పేరు భారతమ్మ. నెల్లూరు శివగిరి కాలనీలోని మూడో వీధిలో అద్దెకు ఉంటోంది. BSNLలో జాబ్‌ చేసి రిటైర్ అయ్యాడు భారతమ్మ భర్త సాయినాథ్‌. ఇటీవలే కరోనా బారినపడ్డాడు. నెటిగివ్ వచ్చిన తర్వాత.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోయాడు. భర్త అంత్యక్రియలు నిర్వహించిన భారతమ్మ.. తిరిగి అద్దెకు ఉంటున్న ఇంటికి వస్తే.. ఓనర్ మానవత్వంతో చేరదీయాల్సింది పోయి.. మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు.

Nellore 2

భర్తను కోల్పోయి పుట్టెడు దుఖఃంలో ఉన్న భారతమ్మను ఇంటిలోనికి రాకూడదని తెగేచి చెప్పాడు. దాంతో ఇదిగో భారతమాతకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఈ భారతమ్మ నడిరోడ్డున పడింది. కట్టుకున్న భర్త దూరమైన తనకు కనీసం నిలువ నీడ నివ్వకపోవడంతో కన్నీటి పర్యంతమైంది.

కరోనా బాధితుల పట్ల ప్రజలు సహృదయంతో వ్యవహరించమని ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే వాస్తవంగా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు భారతమ్మ విషయంలో తక్షణం కలుగచేసుకొని ఆమెకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

Read also: Sand Reach: ఎట్టకేలకు చెవిటికల్లు ఇసుక రీచ్ దగ్గర 24 గంటలుగా కొనసాగిన టెన్షన్‌కి తెర.. ఎలా?

ఒక్కో రన్‌కు రూ. 24.50 లక్షల సంపాదన.. ఒక్క తప్పుతో పంత్ జేబు ఖాళీ
ఒక్కో రన్‌కు రూ. 24.50 లక్షల సంపాదన.. ఒక్క తప్పుతో పంత్ జేబు ఖాళీ
అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్..
అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్..
కారుపై గోడ కూలి డ్యామెజ్‌ అయ్యిందా? నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా
కారుపై గోడ కూలి డ్యామెజ్‌ అయ్యిందా? నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా
మామిడి పండుతో కలిపి పెరుగు తింటున్నారా..? తింటే ఏమౌతుందో తెలిస్తే
మామిడి పండుతో కలిపి పెరుగు తింటున్నారా..? తింటే ఏమౌతుందో తెలిస్తే
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..