AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: కొబ్బరి పీచుతో అందమైక కళాఖండాలు సృష్టిస్తోన్న కోనసీమ మహిళలు

కోనసీమలో కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. పాశర్లపూడి గ్రామ మహిళలు కొబ్బరి కాయ పీచుతో పిచ్చుక గూళ్ళను తయారు చేసి.. జీవనోపాధిని సాగిస్తూ పర్యావరణ అనుకూలతను ప్రోత్సహిస్తున్నారు. వీరి పిచ్చుక గూళ్లు ఎంతో అందంగా ఉండి.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Konaseema: కొబ్బరి పీచుతో అందమైక కళాఖండాలు సృష్టిస్తోన్న కోనసీమ మహిళలు
Eco Friendly Bird Nests
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 20, 2025 | 6:21 PM

Share

కోనసీమ ప్రాంతం ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందిందే కాకుండా.. కొబ్బరి పంటకు గూడా ప్రముఖంగా నిలుస్తుంది. ఇక్కడి ప్రజల జీవనాధారం ఈ కొబ్బరి పంటే. అందుకే కొబ్బరి చెట్టుని కల్పవృక్షంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కల్పవృక్షం అంటే కోరుకున్నవన్నీ అందించేదని నమ్మకం. అదే విధంగా కొబ్బరి చెట్టు ప్రతి భాగం అంటే ఆకుల నుంచి కాయ వరకు మానవ జీవితానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి చెట్టు నుండి వివిధ ఉత్పత్తులు పొందుతూ.. స్థానిక ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ ప్రాంతంలోని పాశర్లపూడి గ్రామ మహిళలు కొబ్బరి కాయ పైన ఉండే డొక్క నుంచి పీచు తీసి అందమైన పిచ్చుక గూళ్ళను తయారు చేస్తున్నారు. ఈ పిచ్చుక గూళ్ళు అచ్చం ప్రకృతిలో పిచ్చుకలు రూపొందించుకునే గూళ్లలా ఉండి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

నలుగురు మహిళలు కలిసి గ్రూపులుగా పనిచేస్తూ ఈ గూళ్ల తయారీలో నైపుణ్యం సాధించారు. ఈ పని ద్వారా తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా.. ప్రకృతితో అనుబంధాన్ని కొనసాగించగలుగుతున్నారు. ఈ పిచ్చుక గూళ్ళు మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతూ… పర్యావరణ అనుకూలమైన జీవనశైలికి ప్రేరణగా నిలుస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..