Andhra: ఈ ఫోటో ఫ్రేమ్‌లలో ఏముందో కనిపెట్టగలరా..! శివ, పార్వతులే అనుకోకండి.. మరింకేం ఉందంటే.?

ఇవి చూసేందుకు ఒకటి లేత నీలిరంగులోనూ, మరొకటి ఎరుపు రంగులోనూ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎరుపు రంగు ఫోటో ఫ్రేమ్‌లో అమ్మవారి చిత్రాలు కనిపిస్తాయి. ఆ బొమ్మల మధ్యలో అందంగా, అలంకరణగా దేవి స్తోత్రాలను లిఖించారు. లేత నీలం రంగులో ఉన్న ఫోటో ఫ్రేమ్‌లో స్వామివారి రూపాలు..

Andhra: ఈ ఫోటో ఫ్రేమ్‌లలో ఏముందో కనిపెట్టగలరా..! శివ, పార్వతులే అనుకోకండి.. మరింకేం ఉందంటే.?
Andhra News

Edited By:

Updated on: Dec 16, 2025 | 1:11 PM

శివుడు లయకారుడు. జగత్తులోని ప్రతి అణువులో ఉన్న ఆ పరమేశ్వరుడిని భక్తులు భిన్న రూపాల్లో కొలుస్తారు. సంగీతార్చన , పాటలు , నృత్యం , చిత్రం ఇలా తమకు తోచిన విధానంలో భక్తులు ఆ దేవుడ్ని అర్చిస్తుంటారు. ఇలాంటి ఒక అజ్ఞాత భక్తుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉమాసోమేశ్వరజనార్ధన స్వామి ఆలయానికి రెండు పెద్ద ఫోటో ఫ్రేములు బహుమతిగా ఇచ్చారు. పంచారామక్షేత్రంలో ఇవి ఇప్పుడు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అందులో అంతగొప్ప ఏముందనుకుంటున్నారా.! అయితే ఇవి సాధారణ ఫోటో ఫ్రేములు కావు.

ఇవి చూసేందుకు ఒకటి లేత నీలిరంగులోనూ, మరొకటి ఎరుపు రంగులోనూ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎరుపు రంగు ఫోటో ఫ్రేమ్‌లో అమ్మవారి చిత్రాలు కనిపిస్తాయి. ఆ బొమ్మల మధ్యలో అందంగా, అలంకరణగా దేవి స్తోత్రాలను లిఖించారు. లేత నీలం రంగులో ఉన్న ఫోటో ఫ్రేమ్‌లో స్వామివారి రూపాలు, చిహ్నాలు, బొమ్మలను లిఖించి వాటిలో శివ స్తోత్రాలు లిఖించారు. ఈ ఫోటోలను చూస్తే పైకి మామూలు శివపార్వతుల బొమ్మలుగా కనిపిస్తాయి. పరీక్షించి చూస్తేనే బొమ్మల్లో ఉండే స్తోత్రాలు కనిపిస్తాయి. అన్నపూర్ణదేవి సహస్రనామ స్తోత్రం, శ్రీ రాజరాజేశ్వరీ దేవి సహస్రనామ స్తోత్రం, సౌందర్య లహరి స్తోత్రం, అమ్మవారి శక్తి రూపాలను అందంగా రూపొందించారు. స్వామివారి ఫోటో ఫ్రేమ్‌లో పరమేశ్వరుని శ్రీ శివ సహస్రనామ స్తోత్రం, శ్రీ సద్యోజాత ముఖం సహస్ర నామావళి, నమకం, చమకం, రుద్ర త్రిశతి రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన కొంతమంది మహిళలు, భక్తులు ఈ ఫోటో ఫ్రేమ్‌లను ఆలయంలో సమర్పించినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు. భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయం, యనమదుర్రు శక్తీశ్వరస్వామి ఆలయాల్లో ఈ ఫోటో ఫ్రేమ్‌లు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..