Araku Valley: టూరిస్టులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రైన్ వచ్చేసింది..

అరకు వ్యాలీ.. ఈ ప్రాంతాన్ని ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో అరకు సోయగాలను ఆస్వాధించేందుకు ఎంతోమంది ప్రయాణికులు అరకు వ్యాలీకి వస్తుంటారు.

Araku Valley: టూరిస్టులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రైన్ వచ్చేసింది..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 8:21 AM

అరకు వ్యాలీ.. ఈ ప్రాంతాన్ని ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో అరకు సోయగాలను ఆస్వాధించేందుకు ఎంతోమంది ప్రయాణికులు అరకు వ్యాలీకి వస్తుంటారు. అక్కడ బస చేస్తుంటారు. అంతకంటే ముఖ్యమైనది అరకు రైల్. ఈ రైలు ప్రయాణం అద్భుతమనే చెప్పాలి. ఎత్తైన కొండలు, కోనలు, గుహల మధ్య వయ్యారంగా సాగిపోయే ఈ రైలు ప్రయాణాన్ని యాత్రికులు ఎంతగానో ఇష్టపడుతారు. అయితే, కరోనా మహ్మారి కారణంగా దాదాపు 8 నెలల క్రితం విశాఖ కిర౦డోల్ రైలు నిలిచిపోయింది. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో 8 నెలల విరామం అన౦తర౦ మళ్లీ ప్రయాణికుల ముందుకు వచ్చేసింది. రైలు ప్రయాణాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. నేటి ఉదయం 6గ౦టల 40నిమిషాలకు విశాఖ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. అలా రైలు వచ్చిందో లేదో.. అరకు పర్యాటకలుతో కిటకిటలాడుతూ ట్రైన్ బయలుదేరి౦ది. గతంలో మాదిరిగానే సి౦హాచల౦, కొత్తవలస, ఎస్. కోట, బొర్రా గుహలు, అరకుతో పాటు ఒరిస్సా లోని పలు స్టాపులలో ఈ ట్రైన్ అగను౦దని రైల్వే అధికారులు తెలిపారు.

కాగా, సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ప్రయాణించే కిరండోల్ ప్యాసింజర్‌ రైలుకు చివరిలో విస్టాడోమ్ రైలు(అద్దాల రైలు బోగీ) బోగిని అమర్చుతారు. ఇందులో ప్రయాణానుభూతి మరో లెవల్‌లో ఉంటుందనే చెప్పాలి. ఎత్తైన కొండలు, కోనలు, గుహలు మధ్య ఈ రైలు ప్రయాణం సాగుతుండగా.. అరకు వ్యాలీ ప్రకృతి రమణీయ దృష్యాలు కనువిందు చేస్తాయి. అందుకే టూరిస్టులు అరకు వ్యాలీతో పాటు.. ఈ రైలును అంతగా ఇష్టపడుతారు.

Latest Articles
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!