AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మినీ యుద్ధ ట్యాంకర్ ను తయారు చేసి.. దేశ రక్షణకు నేను సైతం అంటున్న కాకినాడ కుర్రోడు

పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరిగిన ప్రతిసారి దేశ రక్షణలో తను కూడా భాగస్వామ్యం అవలేనందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు ఓ యువకుడు. యుద్ధంలో పాల్గొనేందుకు తనకి వీలు లేకపోవడంతో యుద్ధానికి ఉపయోగపడే ఓ డమ్మీ వెపన్ లను, యుద్ధ ట్యాంకర్ వాహనాన్ని. తయారు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం చేస్తే దేశ రక్షణ కోసం యుద్ద పరికరాలు చేస్తానని చెబుతున్నాడు.

Andhra Pradesh: మినీ యుద్ధ ట్యాంకర్ ను తయారు చేసి.. దేశ రక్షణకు నేను సైతం అంటున్న కాకినాడ కుర్రోడు
Mini War Tank
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 11:42 AM

Share

కాకినాడ జిల్లాకు చెందిన యువకుడు గతంలో ఏకీ 47, ఆర్ ఎఫ్ ఎల్ రైఫిల్, మినీ యుద్ధ ట్యాంకర్ లాంటివి తయారు చేసి.. అనేక చోట్ల ప్రదర్శించాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మినీ యుద్ధ ట్యాంకర్ తయారుచేసి అందరిని అబ్బురపరాస్తున్నాడు. తను చేసిన యుద్ద ట్యాంకర్ ఏ విధంగా పనిచేస్తుందో నలుగురికి వివరిస్తు పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు కాకినాడ జిల్లా యు. కొత్తపల్లి మండలం వెంకటరాయపురం గ్రామానికి చెందిన పంపన నాగేంద్ర అనే యువకుడు. దేశ రక్షణలో తాను కూడా అడుగు వేసి ఇండియన్ ఆర్మీలో పనిచేయాలన్నది నాగేంద్ర చిరకాల కోరిక.. ఇంటర్ మీడియట్ చదివి గతంలో రెండు సార్లు ఆర్మీలో చేరేందుకు అర్హత పరీక్ష రాసి నాగేంద్ర విఫలమైయాడు.

ఆర్మీలో పనిచేయాలని మక్కువతో ఆర్మీ కోసం ఏదైనా చేయాలని తపన పడుతు డమ్మీ వెపన్స్ తయారు చేసి అనేక మందికి దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆర్మీ, ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశ భద్రతకు సంభందించిన మరిన్ని రక్షణ పరికరాలు తయారు చేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నాడు.. ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించి పలువురిని ప్రోత్సహిస్తున్న మా ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తనకు తోడ్పాటు అందించాలని నాగేంద్ర వేడుకుంటున్నాడు..

నాగేంద్ర కు దేశభక్తి ఎక్కువ.. చదివింది పదవ తరగతి తరువాత టెక్నాలజీ పై ఇష్టంతో ఐ.టి.ఐ పూర్తి చేశాడు.. అనంతరం ఇంటర్ పూర్తి చేశాడు… పేద కుటుంబానికి చెందిన నాగేంద్ర జెసిబి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. కాళీగా ఉన్న సమయంలో తండ్రికి సహాయకుడుగా వడ్రంగి పనులకు వెళ్తున్నాడు.. ఆర్మీలో చేరడం అంటే ఇష్టంతో రెండు సార్లు అర్హత పరీక్ష రాసి విఫలమయ్యాడు.. అంతటి తో నిరుత్సాహం చెందకుండా అందుబాటులో ఉన్న చిన్న చిన్న చెక్క, ఇనుప వస్తువులతో చిన్న చిన్న వస్తువులను తయారు చేయడం మొదలెట్టాడు.. పైగా తనకు మక్కువతో దేశ భద్రతకు సంభాదించిమ రక్షణ పరికరాలను తయారుచేయడం మొదలెట్టాడు.

ఇవి కూడా చదవండి

2019 చిన్న యుద్ధ ట్యాంకర్ తయారు చేసాడు, ఆ తరువాత చెక్క తో ఏ.కె 47 రాకెట్ లాంచర్ లను అప్పటి జిల్లా ఎస్పీ పలు పాఠశాలలోనూ ప్రదర్శనలు చేశాడు… చదువు కుంటున్న పిల్లలకు కావలసిన సైన్స్ ప్రాజెక్ట్ లకు సంభదించిన అనేక పరికరాలు తయారు చేసి కళాశాలలకు అందిస్తున్నాడు.

ఇటీవల పాకిస్తాన్ ముష్కరులు పహల్గాం లో జరిపైన కాల్పులు ఘటన కలచి వేసిందని, ఆపరేషన్ సిందూర్ కు తన కొత్తగా ఏదైనా ఆయుధాన్ని అందించాలని దృక్పథంతో అత్యాధునిక టెక్నలజీ తో కూడిన యుద్ధట్యాంకర్ ను తయారుచేయడం నాగేంద్ర మొదలెట్టాడు.. మార్కెట్ లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసి ఇనుప సమగ్రితో 45 రోజులు పాటు శ్రమించి లక్ష ఎనభైవేలు ఖర్చు చేసి యుద్ధ ట్యాంకర్ ను నాగేంద్ర తయారు చేసాడు.. దీనిని కకినాడ బీచ్ పార్క్ లో విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన కోసం, ప్రజలకు అవగాహ కల్పించడం కోసం ఏర్పాటు చేసేందుకు ఒకరు ఆర్థిక సహాయం చేశారని నాగేంద్ర తెలిపాడు. ఎవరైనా పేపర్ పై ఏదైనా డ్రాయింగ్ గీసి ఇస్తే ఇట్టే చెక్క తో దాని నమూనా నాగేంద్ర చేసి చూపిస్తాడాని స్థానికులు చెబుతున్నారు.

తన అభిమాన నటుడు, పిఠాపురం ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించి పలువురిని ప్రోత్సహిస్తున్నారని, తనకు కూడా ప్రభుత్వం తరపున తోడ్పాటు అందిస్తే దేశం రక్షణ కసం అనేక యుద్ధ పరికరాలు తయారుచేసి కార్మిక అందిస్తానని నాగేంద్ర తెలుపుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..