AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు..

Andhra: దూసుకువస్తున్న ట్రావెల్స్ బస్సు.. అనుమానంతో టోల్ ప్లాజా వద్ద ఆపి చెక్ చేయగా..
Kaza Guntur Toll Plaza
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 1:50 PM

Share

పదహారో నంబర్ జాతీయ రహదారిని డ్రగ్స్ రవాణాకు పెడ్లర్స్ కేంద్ర స్థానంగా మార్చుకున్నారు.. ఏంచక్కా బస్సుల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ పెడ్లర్‌ను మంగళగిరి పోలీసులు చాకచక్యంగా కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు.. వివరాల ప్రకారం.. వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియం ఏరియాకు చెందిన బొనిగె జాన్ సామియేల్ డిగ్రీ చదువుతున్న సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. కర్నాటకలోని ఉడిపిలో బిఎస్సీ చదువుతున్న సమయంలో గంజాయి తీసుకోవడం అలవాటుగా మారింది.. ఈ క్రమంలోనే దేవరాజ్ అనే వ్యక్తి అతనికి గంజాయి సప్లై చేసేవాడు. కొంతకాలానికి ఎండిఎంఏ డ్రగ్ ను కూడా సామేల్ కు దేవరాజ్ ఇచ్చేవాడు. తాను వినియోగించగా మిగిలిన డ్రగ్ ను గ్రాము మూడు వేల రూపాయలకు సామియేల్ ఇతరులకు విక్రయించేవాడు.

ఈక్రమంలోనే తరుచూ బెంగుళూరు నుంచి ప్రయాణం చేస్తుండేవాడు.. హైడ్రో గంజాయి కావాలన్న ఉద్దేశంతో సామియేల్ ఈ నెల 21న బెంగళూరు వెళ్లి దేవరాజ్ ను కలిశాడు. యాభై వేల రూపాయలు వెచ్చించి హైడ్రో గంజాయితో పాటు మూడు ప్యాకెట్ల ఎండిఎంఏ డ్రగ్‌ను కొనుగోలు చేశాడు. ఆ రోజు రాత్రి స్నేహితుడి రూంలో ఉన్న సామియేల్ ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో వైజాగ్ బయలు దేరాడు.

Drugs

Drugs

వీడియో చూడండి..

ఈ సమాచారాన్ని ముందే పసిగట్టిన మంగళగిరి పోలీసులు.. కాజా టోల్ గేట్ వద్ద సామియేల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 32 గ్రాముల క్రిస్టల్ ఎండిఎంఏ, 6 గ్రాముల హైడ్రో గంజాయి, 3.5 గ్రాముల ఎండిఎంఏ టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దేవరాజ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..