చెన్నైలోని ఐఐటీలో చదవుతున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కడపకి చెందిన పుష్పక్ శ్రీసాయి అనే విద్యార్థి ఐఐటీ మద్రాస్ లోని ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. తను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీసాయిని గుర్తించిన అతని స్నేహితులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన కొట్టూర్పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపెట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఐఐటీలో ఇంజినీరింగ్ చదివి తమ కళలను సాకారం చేస్తాడని అనుకున్న శ్రీసాయి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. శ్రీసాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అనే ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు. చదువులు ఒత్తిడి వల్లేనా లేక వ్యక్తిగతంగా ఇంకేమైన పరిస్థి్తులు కారణమయ్యాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీసాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..