Andhra News: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. రూ.1000కే సినిమా థియేటర్..! ఆ జిల్లాలో హాట్ టాపిక్ మారిన పోస్టర్లు!
కొత్త కొత్త ఆలోచనలు.. కొత్త కొత్త పోకడలు .. మాయా లేదు మంత్రం లేదు .. వెయ్యు రూపాయలతో టిక్కెట్ కొనండి.. ఏసీ ధియేటర్ సొంతం చేసుకోండి అంటూ పట్టణంలో వెలసిన బ్యానర్లు ఇప్పుడు సర్వత్రా చర్చగా మారాయి. ఇంతకీ ఈ పోస్టర్ల ఆంతర్యం ఏమిటి.. కోట్ల రూపాయల స్దలాన్ని ఎందుకు ఇలా రోడ్టున పెట్టారు .. ఇంతకూ ఈ లక్కీ డిప్ ఎక్కడో తెలుసుకుందాం పదండి.

కడప జిల్లా నడిబొడ్డున వెలసిన కొన్ని బ్యానర్లు ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారాయి. ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ వెయ్యి రూపాయలకే థియేటర్ మీ సొంతం..30 సెంట్లలో గల ఏసీ థియేటర్ సొంతం చేసుకోండి. కూపన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అదృష్ట వంతులు ఎవరో మీరే తెలుసుకోండి పూర్తి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తో సహా మేమే చేయుస్తాం అంటూ.. నగరంలో బ్యానర్లు ప్రత్యక్షం అవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇంతకీ ఇది ఫేక్ వ్యవహారమా .. నిజమేనా అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ.. ఈ లక్కీ డ్రా నిజమేనని.. ప్రచారంలో ఉన్న తహర్ థియేటర్‌ను కొన్నేళ్ల క్రితం రూ.8.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశామని.. ఆ తర్వాత దానిపై రూ.4.5కోట్ల బ్యాంక్ లోన్ తీసుకున్నట్టు తెలిపాడు.అయితే దీన్ని సేల్ చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన అన్నారు. ఒకే సారి ఇంతపెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ కొనడానికి రావట్లేదని.. అందుకే ఈ ఆస్తిని అమ్మాలనే ఆలోచనతో ఇలా లక్కీ డిప్ ఆటోచని చేసినట్టు తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన ప్రాపర్టీని లక్కి డిప్ ద్వారా ఎవరికి వస్తే వారికి రిజిస్ట్రేషన్ చార్జీలతో పూర్తి స్టాంపు డ్యూటీతో మేమే రిజిస్టర్ చేసి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే తాము లక్ష మందిని టార్గెట్గా చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. అందుకే పబ్లిక్‌గా ఈ అంశాన్ని బయటపెట్టామని చెప్పారు.
అయితే ఈ డిప్‌లో పాల్గొనే అవకాశం మార్చి 28వ తేదీ వరకే ఉందని.. అప్పటి వరకు వచ్చిన కూపన్స్ అన్నింటిని తీసుకొని.. సోషల్ మీడియాలో వేదికగా లైవ్ స్ట్రీమింగ్ పెట్టి లక్కీ డిప్ తీస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 300 వరకు టోకేన్స్ వచ్చాయని.. వీటిని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్నట్టు తెలిపాడు.ఏదేమైనా వెయ్యి రూపాయలకే థియేటర్ సొంతం చేసుకోండి అని వెలిసిన బ్యానర్లు ఇప్పుడు కడపలో హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




