Nara Lokesh Vs YCP: ఆరోపణలు నిరూపించాలంటూ లోకేష్ కు జోగి రమేష్ సవాల్.. అన్నా క్యాంటీన్ల మూసివేతపై లోకేష్ సంచలన కామెంట్స్..

లోకేష్ తీరుపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్‌.. ‍ప్రజల తరపున పోరాడుతున్నందుకు తనపై ఆంక్షలా అని లోకేష్‌ ప్రశ్నించడం పైనా RGV సీరియస్ అయ్యారు. ఓవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. తనపై లోకేష్‌ చేసిన కామెంట్స్‌కు రామ్‌గోపాల్ వర్మ సైతం సమాధానం చెప్పారు. మరి RGV వ్యాఖ్యలపై లోకేష్‌ స్పందిస్తారో.. లేదో చూడాలి.

Nara Lokesh Vs YCP: ఆరోపణలు నిరూపించాలంటూ లోకేష్ కు జోగి రమేష్ సవాల్.. అన్నా క్యాంటీన్ల మూసివేతపై లోకేష్ సంచలన కామెంట్స్..
Nara Lokesh Padayatra
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2023 | 6:59 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. టైమ్‌, ప్లేస్‌ చెప్పాలని లోకేష్‌కు సవాల్ చేశారు. షూటింగ్‌ పర్మిషన్‌కు, మీటింగ్‌ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటీ అని లోకేష్‌ను ప్రశ్నించారు. టీడీపీ నేతల విమర్శలపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్‌. గన్నవరం సభ.. ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు. మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత లోకేష్‌. టైమ్‌, ప్లేస్‌ చెబితే అక్కడికే వస్తానన్నారు జోగి రమేష్. పాదయాత్ర అంటే బౌన్సర్లను పెట్టుకుని చేయడం కాదన్నారు మంత్రి జోగి రమేష్. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారన్నారు. YS రాజశేఖర్‌ రెడ్డి, CM జగన్‌ మాత్రమే పాదయాత్రకు అర్హులన్నారు.

లోకేష్ తీరుపై డైరెక్టర్‌ రామ్‌గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్‌.. ‍ప్రజల తరపున పోరాడుతున్నందుకు తనపై ఆంక్షలా అని లోకేష్‌ ప్రశ్నించడం పైనా RGV సీరియస్ అయ్యారు. ఓవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. తనపై లోకేష్‌ చేసిన కామెంట్స్‌కు రామ్‌గోపాల్ వర్మ సైతం సమాధానం చెప్పారు. మరి RGV వ్యాఖ్యలపై లోకేష్‌ స్పందిస్తారో.. లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరోవైపు లోకేష్ పాదయాత్ర ఏలూరు జిల్లాలో జరుగుతోంది. స్థానిక ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పాటు..  ఇంటి పన్ను, చెత్త పన్నులతో తాము చాలా ఇబ్బంది పడుతున్నాం.. అని మహిళలు లోకేష్ కు విన్నవించుకున్నారు.

జనవరి 27 వ తేదీన కుప్పం నుంచి లొకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. అనేకాదు తాజాగా అన్నా క్యాంటీన్ మూసివేతపై కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..