Andhra Pradesh: గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు.. ఇదిగో వివరాలు

ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు పదోన్నతులు పొందారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితం పదోన్నతులు పొందారు. మిగిలిన జిల్లాల్లో 35 మందికి పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారని.. అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది.

Andhra Pradesh: గ్రామ సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు.. ఇదిగో వివరాలు
Village Secretariat
Follow us
Aravind B

|

Updated on: Aug 26, 2023 | 7:32 AM

నాలుగేళ్ల క్రితం సచివాలయాల్లోని గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ (విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌)గా నియామకమైనటువంటి ఉద్యోగుల్లో కొందరు నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి దక్కించుకున్నారు. ప్రస్తుతం కొత్త బాధ్యతల్లో వారు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 53 ఖాళీ ఉంటే.. ఆ పోస్టులన్నింటినీ విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియను ఉద్యానవన శాఖ నెల రోజుల క్రితం చేపట్టింది.

ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు పదోన్నతులు పొందారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితం పదోన్నతులు పొందారు. మిగిలిన జిల్లాల్లో 35 మందికి పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారని.. అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సైతం వైసీపీ ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఆ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించినటువంటి బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడితే.. ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో దాదాపు అందరూ ఏడాది కిందట ప్రొబేషన్‌ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనం అందుకున్నారు. అయితే వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో మండల వ్యవస్థ ఏర్పాటుకాగా ఆ మండలాల్లో పని చేసేందుకు ఉద్దేశించిన కీలక స్థాయి ఎంపీడీవోల ఉద్యోగాలకు తొలివిడత 13 సంవత్సరాల తర్వాత 1999లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీడీవోలు పదోన్నతులు పొందేందుకు సంబంధించిన సర్వీసు రూల్స్‌కు కూడా 2022 వరకు అతీగతీ లేదు. అప్పడు ఎంపీడీవోగా నేరుగా ఉద్యోగం పొందిన వారికి సైతం 23 ఏళ్ల తర్వాత గానీ పదోన్నతి రాలేదు. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, రెండు నెలల్లోనే ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేసింది. ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త శాశ్వత పోస్టు మంజూరు చేయాలంటే నెలలు, సంవత్సారాలు పడుతుంది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,524 కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..