Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగ అవకాశాలు..

విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కారాగారంలో ఖాళీగా ఉన్న మేల్ నర్సింగ్, డ్రైవర్, ఎలక్ట్రీషీయన్‌ , స్వీపర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేయాలన్నారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగ అవకాశాలు..
ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ careers.bhel.in ని సందర్శించాలి .
Follow us
M Sivakumar

| Edited By: Aravind B

Updated on: Aug 25, 2023 | 10:29 AM

విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కారాగారంలో ఖాళీగా ఉన్న మేల్ నర్సింగ్, డ్రైవర్, ఎలక్ట్రీషీయన్‌ , స్వీపర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 4 లోపు అప్లై చేయాలన్నారు. జిల్లా కారాగారంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా కారాగారంలో ఖాళీగా ఉన్న మేల్‌ నర్సింగ్‌, డ్రైవర్‌, ఎలక్ట్రీషియన్‌, స్వీపర్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు అయన తెలిపారు.

మేల్‌ నర్సింగ్‌, స్వీపర్‌ పోస్టులకు నెలకు రూ.12 వేల రూపాయలు చెల్లించనున్నారు. అలాగే డ్రైవర్‌, ఎలక్ట్రీషీయన్‌ పోస్టులకు నెలకు రూ.15 వేలు నెలసరి వేతనంగా చెల్లించనున్నట్లు తెలిపారు. సదరు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ దరఖాస్తు ఫారం, జత చేయవలసిన ధ్రువపత్రాల ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కలెక్టర్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం పూర్తిచేసిన దరఖాస్తులను హంసా పాల్‌ జిల్లా కారాగారం పర్యవేక్షణాధికారి విజయవాడ వారి కార్యాలయంలో 25వ తేదీ నుండి సెప్టెంబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలన్నారు. గడువు తేదీ ముగిసిన అనంతరం ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. ఆసక్తి కలిగి అర్హత ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రకటనలో కోరారు.

ఇవి కూడా చదవండి

విజయవాడ జిల్లా కారాగారంలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా నర్సింగ్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్‌, స్వీపర్‌ లాంటి పోస్టుల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లా కారాగంలో ఈ నోటిఫికేషన్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తుంటారు. అయితే మరో విషయం ఏంటంటే ఇందులో ఎంపికైన వారిని అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచనలు చేశారు.