Andhra Pradesh: తాడిపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్.. డివైడర్లపై పడుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.. ఆ తర్వాత..

|

Apr 25, 2023 | 8:05 AM

తాడిపత్రిలో నిన్న ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగింది. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాతో పాటు, తాడిపత్రిలో మున్సిపల్‌ కమిషనర్‌ విధుల నిర్లక్ష్యంపై మున్సిపల్ ఆఫీస్‌ ఎదుట వంటావార్పునకు జేసీ పిలుపు నిచ్చారు. దీంతో జేసీ ఇంటిదగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Andhra Pradesh: తాడిపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్.. డివైడర్లపై పడుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.. ఆ తర్వాత..
Jc Prabhakar Reddy
Follow us on

తాడిపత్రిలో నిన్న ఉదయం నుంచి హైటెన్షన్ కొనసాగింది. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాతో పాటు, తాడిపత్రిలో మున్సిపల్‌ కమిషనర్‌ విధుల నిర్లక్ష్యంపై మున్సిపల్ ఆఫీస్‌ ఎదుట వంటావార్పునకు జేసీ పిలుపు నిచ్చారు. దీంతో జేసీ ఇంటిదగ్గరకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదన్న పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 100 మంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల చర్యలను ఖండిస్తూ తన ఇంటి ముందే కుర్చీలో కూర్చొని జేసీ నిరసన తెలిపారు. కుర్చీతో సహా జేసీని బలవంతంగా తిరిగి లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

అయితే, తాడిపత్రి పట్టణంలో రాత్రి హైడ్రామా కొనసాగింది. కౌన్సిలర్లను అరెస్ట్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపైనున్న డివైడర్లపై పడుకుని నిరసన వ్యక్తంచేశారు. సాయంత్రం కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో జేసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి తీసుకెళ్లారు. అయినప్పటికీ.. జేసీ నిరసనను కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఉదయాన్ని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి మున్సిపల్‌ ఆఫీసుకు వచ్చారు. ఆఫీసు ఆవరణలోనే బ్రష్ చేసి, స్నానం చేశారు. దీంతో మున్సిపల్‌ ఆఫీసుకు వస్తానన్న పంతాన్ని జేసీ నెగ్గించుకున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న హైడ్రామా రాత్రి డివైడర్లపై పడుకుని నిరసన తెలిపే వరకు వెళ్లింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..