Pawan Kalyan: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్.. గణపతి విగ్రహాన్ని అందించి.. అండగా ఉంటానని భరోసా..
Pawan Kalyan: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పరామర్శించారు. కృష్ణా జిల్లా లింగాల..
Pawan Kalyan: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పరామర్శించారు. కృష్ణా జిల్లా లింగాల గ్రామానికి చెందిన జనసేన అభిమాని భార్గవ్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. ఇవాళ అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. భార్గవ్ వైద్యం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే భార్గవ్‌కు ధైర్యం చెప్పిన పవన్.. అతనికి వెండి గణపతి విగ్రహాన్ని అందించారు. త్వరలోనే కోలుకుంటావని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆ తరువాత భార్గవ్ తల్లిదండ్రులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. భార్గవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్లతోనూ మాట్లాడారు. మూడు నెలల కిందటే క్యాన్సర్ నిర్ధారణ అయిందని వారు పవన్‌కు తెలిపారు. జనసేన పార్టీ తరఫున వైద్యులను పంపిస్తామని, తగిన సేవలను అందిస్తారని భరోసా ఇచ్చారు. అలాగే ఎన్ఆర్ఐ దాతల నుంచి సహాయం అందేలా పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తాయని పవన్ కళ్యాణ్ వారికి ధైర్యం చెప్పారు.
Also read: