Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు

కాకినాడ జిల్లా చిత్రాడలో మార్చి 14 జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగబోతోంది. జయకేతనం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు జనసేన భారీగా ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా ఓ రైతు విభిన్న రూపంలో పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

Janasena: ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు
Janasena Logo In Field
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 14, 2025 | 12:08 PM

జనసేన 12వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కొల్లిపర మండలం అత్తోట రైతు బాపారావు పార్టీపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. తన వ్యవసాయ భూమిలో మొక్కలతో జనసేన పార్టీ లోగో కనిపించేలా చేశాడు. ఆవిర్భావ దినోత్సవం రోజు అందరికి తెలిసేలా వాటిని ప్రదర్శించాడు. ప్రకృతి వ్యవసాయం చేసే బాపారావు జనసేన అభిమాని. ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న పార్టీపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకోవాలని ఈ విధంగా చేసినట్లు బాపారావు తెలిపాడు. జన సేన లోగోతో పాటు డిప్యూటీ సిఎం, 100 శాతం స్ట్రైక్ రేట్ అంటూ మొక్కలతోనే రూపొందించాడు. 2.5 ఎకరాల్లో ఎర్ర తోటకూర, జనుము విత్తనాలను ఒక క్రమ పద్దతిలో పెంచి లోగో ఆకృతిలు వచ్చేలా చేసినట్లు చెప్పాడు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కల్యాణ్, చంద్రబాబుతో కలిసి పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు అతను చెబుతున్నాడు.

గతంలోనూ వినూత్నంగా బాపారావు మొక్కలతో పలు బొమ్మలు కనిపించేలా మొక్కలు పెంచాడు. వరి మొక్కలతో శంఖు, చక్ర నామాలు, కనకదుర్గమ్మ, గాంధీ ఆకారాలను తన వ్యవసాయ క్షేత్రంలో రూపొందించి అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. వ్యవసాయంపై మక్కువ ఎక్కువ అని..  చేస్తున్న పనితోనే తనకు కిష్టమైన వారిపై అభిమానాన్ని చాటుకోవాలన్న సంకల్పంతో తాను ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..
పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..
మేం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం
మేం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం
ప్రశ్నించే పార్టీ.. సమస్యలు పరిష్కరించే పార్టీగా మారింది
ప్రశ్నించే పార్టీ.. సమస్యలు పరిష్కరించే పార్టీగా మారింది
ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త
ఈ ఏడాది ఎండలు భయంకరమే.. బాబోయ్.! తీవ్ర వడగాలులు.. జర జాగ్రత్త
హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఈ కూరగాయ విత్తనాలను లైట్‌ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు
ఈ కూరగాయ విత్తనాలను లైట్‌ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు
వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందా..? మహిళలకు దిమ్మదిరిగే షాక్‌!
వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందా..? మహిళలకు దిమ్మదిరిగే షాక్‌!
వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది..పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్
వాటి జోలికి వెళ్తే రంగు పడుద్ది..పోలీస్ సింగం స్ట్రాంగ్ వార్నింగ్
చిన్న పనికే విపరీతంగా అలసిపోతున్నారా?
చిన్న పనికే విపరీతంగా అలసిపోతున్నారా?
కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు..
కుల్ఫీ ఐస్క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లు.. ఇవి తింటే పక్కాగా పోతారు..