Watch: తిరుమల కొండలను కమ్మేసిన పొగమంచు.. పాల సముద్రాన్ని తలపించే ఆ అద్భుత దృశ్యాలు ఇవిగో..
తిరుమల కొండలను పొగమంచు కమ్మేసింది. అప్పుడే మొదలైన ఎండాకాలంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే ఎండలు దంచికొడుతుంటే.. తిరుమలలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారు జామున మంచు కమ్మేసి.. చల్లటి వాతావరణం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సమ్మర్ లో డిఫరెంట్ వెదర్ ఆకట్టుకుంది. పొగ మంచు కప్పేసిన తిరుమల కొండల్లోని వాతావరణం భక్తులు, ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుమల ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేలా దట్టమైన అటవీ ప్రాంతాన్ని పొగ మంచు దట్టంగా అలుపుకోవడం చూసిన భక్తులకు వింత అనుభూతి కలిగింది. తిరుమల కొండ కు వెళుతున్న భక్తులు పొగ మంచు, మేఘాలతో పై నుంచి పూర్తిగా కనిపించని తిరుపతి నగరం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి భక్తులు పోటో షూట్ కు దిగారు. ఒకవైపు ఈ నెల మొదటి వారం నుంచే ఉదయం 10 గంటల కంతా ఎండలు దంచి కొడుతుంటే ఈ రోజు తిరుమల గిరులకు చేరే భక్తులకు కనిపించిన వెదర్ వారికి కొత్త అనుభూతికి కారణమైంది.
వీడియో ఇక్కడ చూడండి..
తిరుమల కొండలను పొగమంచు కమ్మేసింది. అప్పుడే మొదలైన ఎండాకాలంతో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడే ఎండలు దంచికొడుతుంటే.. తిరుమలలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తెల్లవారు జామున మంచు కమ్మేసి.. చల్లటి వాతావరణం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..