AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన జనసైనికులు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు జనసేన నాయకుడు అనుకుల రమేష్.

Janasena: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన జనసైనికులు
Janasena Attack On Perni Na
Venkata Narayana
|

Updated on: Sep 30, 2021 | 1:58 PM

Share

Janasena – Perni Nani: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయిని అడ్డుకోవటానికి ప్రయత్నించారు జనసేన నాయకుడు అనుకుల రమేష్. పార్టీ జెండా చేతపట్టుకొని కాన్వాయ్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అతడ్ని హుటాహుటీన పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి పేర్ని నాని ఖబడ్దార్ అంటూ జనసైనికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ అక్విడేట్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్నినాని పరిశీలించడానికి వచ్చారు.

జిల్లాలో ప్రాజెక్టులకు వచ్చిన వరదలు పరిశీలించే క్రమంలో యర్రకాలువ యనమదుర్రు డ్రయిన్ లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా నిడదోవోలు, తణుకు పరిసర ప్రాంత రైతులు వరదల వల్ల అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి అన్నారు. మాజీ సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 10, 12, వేల కెపాసిటీ ఉన్న జలాశయాన్ని 20 వేలకు పెంచారని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్బంగా చెప్పారు. దువ్వలో కొత్త రెగ్యులేటర్ సమీప భవిష్యత్ లోనే ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆదివారం ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే. పవన్ మాటలు జగన్ మీద విషం చిమ్మెలా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 800 థియేటర్లల్లో సినిమాలు ఆడుతున్నాయని పేర్ని నాని చెప్పారు. తెలంగాణలో 413 మాత్రమే నడుస్తున్నాయన్నారు. లవ్ స్టోరీ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నారు.

కేసీఆర్ ను తిట్టే ధైర్యం పవన్ కళ్యాణ్‌కు లేదని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. సాయితేజ్ ప్రమాదం గురించి పోలీసులు చెప్పిందే మీడియా చెప్పిందని పేర్ని నాని తెలిపారు. దీనిపై పవన్‌ తెలంగాణ పోలీసులను ప్రశ్నించాలని సూచించారు. సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్‌ వస్తుందని నాని తెలిపారు. పవన్ కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారంటూ పేర్కొన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు పేర్ని నానిపై మండిపడుతున్నారు.

Janasena Perni Nani

Janasena Perni Nani

Read also: China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం