Amalapuram Violence: ఆ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మాపై ఆరోపణలు.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు..

| Edited By: Ravi Kiran

May 25, 2022 | 2:09 PM

అల్లర్లు జరుగుతాయన్న ఘటనను ముందే రాష్ట్ర ఇంటెలిజన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని జనసేన నేత శివశంకర్ ప్రశ్నించారు.

Amalapuram Violence: ఆ ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మాపై ఆరోపణలు.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు..
Janasena
Follow us on

Janasena on Amalapuram Violence: అమలాపురం ఘటనలో పోలీసులు కంటే ముందే జనసేనను బ్లేమ్ చేస్తూ అధికార వైసీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ శివశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లర్లు జరుగుతాయన్న ఘటనను ముందే రాష్ట్ర ఇంటెలిజన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ప్రశ్నించారు. ఇందులో రాష్ట్ర ఇంటెలిజన్స్ వైఫల్యం ఉందన్నారు. MLC అన౦తబాబు దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేయటంతో వైసిపి పట్ల దళితుల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. దాని నుంచి దృష్టి మరల్చడానికే ఈ విధమైన ఆరోపణలను వైసీపీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ కులాల మధ్య చిచ్చుపెట్టి మనుగడ కొనసాగించాలని చూస్తోంది తప్ప వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదని శివశంకర్ ఎద్దేవా చేశారు.

ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడకు రానున్నారు. అమలాపురంలోని జరిగిన అల్లర్ల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2 గంటలకు విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని జనసేన ప్రకటనలో తెలిపింది.

కాగా.. అమలాపురం ఘటనపై 7 కేసులు నమోదైనట్లు ఏపీ డీజీపీ తెలిపారు. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్ రెండు ఇల్లుల దహనం, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి కి నిప్పు, మూడు బస్సుల దగ్దం పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (Rajendranath Reddy) తెలిపారు. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మంది అరెస్ట్ కు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..