ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి ఒక్క సెకను కూడా ఎంతో విలువైంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడానికి అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా కూడా అందిస్తున్నారు కూడా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు.
• జనసేన ఉచిత అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన శ్రీ @PawanKalyan గారు
ఇవి కూడా చదవండిLink: https://t.co/0U1nMPQWZ0 pic.twitter.com/PxB5XpC8wo
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2022
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మూడు ఉచిత అంబుల్పైన్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ సర్వీసులను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యణ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. మనిషికి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు.. ఈ అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ మూడు అంబులెన్స్ లను సుమారు రూ.30 లక్షల సొంత ఖర్చుతో బత్తుల బలరామకృష్ణ ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సుల్లో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్టు యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు పేషెంట్స్‌కి అందుబాటులో ఉంటాయి. ఈ మూడు అంబులెన్సులు మనిషికి ప్రాధమిక చికిత్సను అందించడంతో పాటు.. వెంతనే బాధిత వ్యక్తులను సమీప ఆస్పత్రికి చేర్చనున్నాయి.
జనసేన ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. pic.twitter.com/cobUn0DI6v
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2022
ఈ ఉచిత సర్వీసులు.. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఉచితంగా సేవలను అందించనున్నాయి. ఎవరైనా బాధితులు అత్యవసర సేవల కోసం ఫోన్ చేస్తే.. వెంటనే బాధితులకు అందుబాటులో ఉంటాయని బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకునేవారి కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సర్వీసులు నేటి నుంచి రాజానగరం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్ననున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..