Pawan kalyan: ఇప్పటం బాధితులకు అండగా జనసేనాని.. ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం

| Edited By: Janardhan Veluru

Nov 08, 2022 | 2:30 PM

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వందాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పోయిన వారికి రూ. లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.

Pawan kalyan: ఇప్పటం బాధితులకు అండగా జనసేనాని.. ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయం
Pawan Kalyan
Follow us on

గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అండగా నిలిచారు. ఇప్పటికే ఇప్పటం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించిన ఆయన తాజాగా వారికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మీడియాకు తెలియజేశారు. ‘మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వందాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పో్యిన వారికి రూ. లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. మార్చి14న ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఇళ్లను కూల్చింది. జేసీబీలను పక్కన పెట్టి, పోలీసులను జె.సి.బి.లను పెట్టి, పోలీసులను మోహరింప చేసి మరీ ఇళ్లు కూల్చివేయడం దారుణం. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు’ అని తెలిపారు.

‘ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి ఆయన చలించిపోయారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. వారికి నైతిక మద్దతుతో పాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందచేస్తారు ‘ అని నాదెండ్ల తెలిపారు. కాగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను పవన్‌ పరామర్శించిన సంగతి తెలిసిందే. స్వయంగా ఇప్పటం వెళ్లిన ఆయన బాధితులను కలుసుకుని పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..