తుంగభద్ర 19వ గేట్ స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటు.. డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ ఎంతో తెల్సా
తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతులు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. విరిగిపోయిన గేటు స్థానంలో నాలుగో ఎలిమెంట్ అమర్చారు.

తుంగభద్ర డ్యామ్ ఆయకట్టు రైతులు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. విరిగిపోయిన గేటు స్థానంలో నాలుగో ఎలిమెంట్ అమర్చారు. లక్షకు పైగా క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్న టైంలో ఇరిగేషన్ టెక్నిక్‌తో ఈ పని పూర్తిచేశారు. స్టాప్‌లాగ్ గేట్‌గా మొత్తం ఐదు ఎలిమెంట్లను అమర్చనున్నారు. భారీ ఎలిమెంట్‌ను అమర్చేందుకు అడ్డంగా ఉన్న సెంటర్ వెయిట్‌ను ముందు తొలగించారు.
తర్వాత తొలి ఎలిమెంటును 20 మంది కార్మికులు క్రస్ట్‌లో అమర్చారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన స్థానంలో బిగించాల్సిన ఎలిమెంట్లు గురువారం ఉదయమే తుంగభద్ర డ్యాంకు చేరాయి. మధ్యాహ్నమే పనులు ప్రారంభించగా, సెంటర్ వెయిట్ అడ్డం వచ్చింది. కౌంటర్‌లాక్, స్కైవాక్‌లను తొలగించడానికి 90 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. సుమారు 30 టన్నుల బరువుండే సెంటర్ వెయిట్‌ను విజయవంతంగా కిందకు దించారు. దీంతో గేటు ఎలిమెంట్ అమర్చడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తొలి ఎలిమెంటును శుక్రవారం సాయంత్రం విజయవంతంగా అమర్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇవాళ మరో మూడు ఎలిమెంట్లను అమర్చి…నీటి వృథాను తగ్గించారు.




