ఏపీలో సీ ప్లేన్స్‌ నిర్వహణకు సర్కార్ మొగ్గు.. కేంద్రం ముందు చంద్రబాబు ప్రతిపాదనలు

అసలేంటీ సీ ప్లేన్స్‌. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఇవే సీ ప్లేన్స్‌. ఈ విమానాలు నీళ్లపై తేలియాడతాయి. వాటర్ టు వాటర్, వాటర్‌ టు ల్యాండ్‌.. ఎనీ ప్లేస్ ఇవి ల్యాండ్ అవ్వగలవు. ప్రత్యేక సందర్భాల్లో సముద్రాల్లోనూ దిగుతాయి. టూరిజంపరంగా ఇప్పటికే విదేశాల్లో చాలా పాపులర్ కూడా.

Follow us

|

Updated on: Aug 17, 2024 | 6:34 PM

అసలేంటీ సీ ప్లేన్స్‌. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఇవే సీ ప్లేన్స్‌. ఈ విమానాలు నీళ్లపై తేలియాడతాయి. వాటర్ టు వాటర్, వాటర్‌ టు ల్యాండ్‌.. ఎనీ ప్లేస్ ఇవి ల్యాండ్ అవ్వగలవు. ప్రత్యేక సందర్భాల్లో సముద్రాల్లోనూ దిగుతాయి. టూరిజంపరంగా ఇప్పటికే విదేశాల్లో చాలా పాపులర్ కూడా. అయితే ఏపీలో వీటిని ప్రవేశపెట్టడం ద్వారా బహళ ప్రయోజనాలు రాబట్టొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. వాటిల్లో ఒకటి టూరిజం డెవలప్‌మెంట్‌. రెండోది వర్షాలు, విపత్తుల సమయంలో తరచూ ముంపునకు గురయ్యే లంక గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ సులువు అవుతుంది. ఎందుకంటే ఇవి రెస్క్యూ బోట్ల కంటే వేగంగా మూవ్ అవ్వగలవు కాబట్టి. పైగా.. మెడికల్ ఎమర్జెన్సీ వేళల్లో ఇవి చాలా కీలకం. అందుకే కేంద్రం సీ పాలసీని ప్రకటించగానే.. దాన్ని తొలిదశలోనే క్యాప్చర్ చేసేందుకు ఏపీ.. ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం కోసం ప్రతిపాదనలు పెట్టింది. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు.. కోస్టల్‌ రీజియన్‌లో చాలాచోట్ల కూడా వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర పాలసీ సపోర్ట్ చేస్తే వీలైనంత త్వరగా అందుకు అవసరమైన ఎయిరో డ్రోమ్స్‌ను నిర్మించేందుకు సిద్ధంగా ఉంది.

వాస్తవానికి కరోనాకు ముందే కేంద్రం సీ ప్లేన్ పాలసీని రూపొందించింది. సీ ప్లేన్స్‌ని నిర్వహిస్తామని స్పైస్ జెట్, మేరీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్‌ సర్వీసెస్, హరిటేజ్ ఏవియేషన్ వంటివి ముందుకు వచ్చాయి కూడా. ట్రయల్‌ రన్ కూడా జరిగింది. అయితే.. ఆ తర్వాక కరోనా రావడం, పరిస్థితులు కాస్త అస్తవ్యస్థంగా మారడంతో పాలసీ వాయిదాపడింది. మరో వారంలో దీన్ని కేంద్రం తిరిగి తీసుకురాబోతోంది. ఏపీ చేస్తున్న మరో ప్రయత్నం హెలిపాడ్స్‌. ఇందుకు సంబంధించి కూడా ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచింది. జిల్లాకో హెలిపాడ్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టింది. సో ప్రతి జిల్లాకు ఒక హెడ్‌ క్వార్టర్స్ ఎలా ఉంటుందో ఫ్యూచర్లో ఒక హెలీపోడ్ కూడా ఉంటుందన్న మాట.

సీ ప్లేన్స్‌, హెలిపాడ్స్‌ మాత్రమే కాదు.. ఎవియేషన్ రంగంలో ఏపీ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను డబుల్ చెయ్యడం, ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను మరింత సమర్థంగా మార్చడం బిగ్ టార్గెట్‌గా ఉంది. నాట్ ఓన్లీ ఏవియేషన్‌. రైల్వే, రోడ్ మార్గాల పైన కూడా ఏపీ ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఎక్కడికక్కడ కనెక్టివిటీ పెంచుకోవాలని చూస్తోంది.

ఏపీలో సీ ప్లేన్స్‌ నిర్వహణకు సర్కార్ మొగ్గు..
ఏపీలో సీ ప్లేన్స్‌ నిర్వహణకు సర్కార్ మొగ్గు..
జార్జి రెడ్డి మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది
జార్జి రెడ్డి మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది
తుంగభద్ర 19వ గేట్‌ స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు..
తుంగభద్ర 19వ గేట్‌ స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
సముద్రంలోకి దూకబోయిన మహిళ, అంతలోనే దేవుడిలా వచ్చిన డ్రైవర్
సముద్రంలోకి దూకబోయిన మహిళ, అంతలోనే దేవుడిలా వచ్చిన డ్రైవర్
టీమిండియా మాన్‌స్టర్ వీడు.. తోప్ అని చెట్టెక్కించారు.. కట్‌చేస్తే
టీమిండియా మాన్‌స్టర్ వీడు.. తోప్ అని చెట్టెక్కించారు.. కట్‌చేస్తే
IND vs BAN: బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ..
IND vs BAN: బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ..
'ఎలా తిరిగినా తమకు సంబంధం లేదు'.. దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌లో!
'ఎలా తిరిగినా తమకు సంబంధం లేదు'.. దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌లో!
కాంతారా హీరోకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం.. బన్నీ ఏమన్నాడంటే?
కాంతారా హీరోకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం.. బన్నీ ఏమన్నాడంటే?
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో చీలికలు.. కోర్టుకెళ్లిన ప్రీతి జింటా
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో చీలికలు.. కోర్టుకెళ్లిన ప్రీతి జింటా