సమాజం శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదుగుతున్నా ఇంకా మూఢా విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. చదువుకున్న వారు కూడా గుడ్డిగా నమ్ముతూ మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని పొన్నె కల్లులో ఓ నకిలీ పూజారి నగ్న పూజలు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. నగ్నంగా పూజ చేస్తే డబ్బులు వస్తాయంటూ యువతులను మోసం చేశాడు.
పలు లాడ్జిలో నగ్న పూజలు చేసిన నకిలీ పూజారి అనంతరం ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతలను పూజ మధ్యలో వెళ్లిపోతే డబ్బులు రావంటూ నమ్మబలికి మరీ అత్యాచారానికి యత్నించాడు. దీంతో మోసపోయామని అర్థమైన యువతులు పోలీసులకు సమాచారం అందించారు. దిశ యాప్ ద్వారా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు చిలకలూరిపేటకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..