Anantapur: సన్నిహిత ఫోటోలు, కాల్ రికార్డింగ్స్‌తో వివాహిత బెదిరింపులు.. యువకుడు ఆత్మహత్య
ఆమెతో అతడికి గతంలో సన్నిహిత సంబంధం ఉండేది. తన మ్యారేజ్ లైఫ్ దెబ్బ తింటుందని అతడు ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. కానీ ఆమె మాత్రం అతడిని వేధించడం మొదలుపెట్టింది. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.. దీంతో...
వివాహిత వేధింపులు భరించలేక యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రాయదుర్గానికి కుత్తీష్ అలియాస్ పృథ్వీ న్యూడిల్స్ పాయింట్ రన్ చేస్తున్నాడు. అతడికి గతంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో సన్నిహిత సంబంధం ఉంది. గతంలో ఇరువురూ ఫోన్ మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. వాటిని వినియోగించి తనను బెదిరిస్తుందని.. కుత్తీప్ గతంలో కేసు పెట్టాడు. తనను సైతం ఇబ్బంది పెడుతున్నాడని వివాహిత అతనిపై కంప్లైంట్ చేసింది. ఇదే విషయంపై కొద్ది రోజుల క్రితం వివాహిత జిల్లా ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇరువురుని పిలిచి విచారించారు. శనివారం మరోసారి విచారణకు రావాలన్నారు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి వివాహిత కుత్తీష్‌కు కాల్ చేసి తన ఇంటికి రావాలని కోరింది. అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో మరొక వ్యక్తిని పంపింది. దీంతో ఆమె ఇంటికి వెళ్లాడు కుత్తీష్. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తన భార్య లలితకు పూసగుచ్చినట్లు చెప్పాడు. శనివారం పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉందని, ఎవరినీ పంపినా ఆమె వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని భార్య గట్టిగా చెప్పింది. చుట్టాల పెళ్లికి ఉరవకొండకు వెళ్లి వచ్చాక పోలీసులకు కంప్లైంట్ చేద్దామని భార్య కుత్తీష్‌కు సూచించింది. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు పయనమైంది.
అయితే దారిలో ఉండగానే వెళ్లగా తన భర్త ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారంతో రావడంతో షాక్‌కు గురైంది. వివాహిత వేధింపులతో ఆవేదన చెందే తన భర్త చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేయకపోవడంతో.. స్టేషన్‌కు ముందు నిరసనకు దిగింది. కుత్తీష్‌కు స్థానికంగా మంచి పేరు ఉండటంతో.. అతడి కోసం స్థానికులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకోవడంతో.. కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఆ వివాహిత బాధితుల లిస్ట్‌గా చాలా పెద్దది అన్న టాక్ నడుస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..