Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ..
Andhra Pradesh: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార వైసీపీ పార్టీ.
Andhra Pradesh: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార వైసీపీ పార్టీ. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే. ఈ హత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే, హత్యారాజకీయాలకు తాము లేదని చెబుతూ.. అనంతబాబు విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.