AP Rains: ఏపీకి వర్షసూచన.. రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో మోస్తరు వానలు..
ఏపీలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం వాయువ్య, దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ద్రోణి..
AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం వాయువ్య, దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతం నుండి వాయువ్య మధ్య ప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య వ్యాపించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులువీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 23వ తేదీ శుక్రవారం ఉత్తరకోస్తా, యానంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరన శాఖ అధికారులు తెలిపారు. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శని, ఆదివారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లోని ఒకటి రెండు చోట్ల శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక రాయలసీమలో శుక్ర, శని, ఆదివారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..