IAS Officers Transfer: ఏపీలో కొత్త సీఎస్‌ రాగానే కీలక ఉత్తర్వులు.. పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సీఎస్‌గా పదవీ విరమణ..

IAS Officers Transfer: ఏపీలో కొత్త సీఎస్‌ రాగానే కీలక ఉత్తర్వులు.. పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు
Follow us
Subhash Goud

|

Updated on: Oct 02, 2021 | 5:49 AM

IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ స్థానంలో 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సమీర్‌ శర్మ నూతన బాధ్యతలు చేపట్టగానే అధికారుల బదిలీలు మొదలు పెట్టారు.  దీంతో ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా గిరిజా శంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కోన శశిధర్, దేవాదాయశాఖ కమిషనర్ గా హరి జవహర్ లాల్ నియమితులు కాగా ఆర్అండ్‌ఆర్ కమిషనర్ గా జే.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇక ఇక వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు నూతన నియామకాలు, బదిలీలకు సంబంధించి కొత్త చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఈరోజే బాధ్యతలు స్వీకరించగా ఈరోజే ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఇవీ కూడా చదవండి:

AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..