AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భలే ఛాన్స్‌ కొట్టేసిన ఐఏయస్‌, ఐపీఎస్ దంపతులు.. భార్య భర్తలిద్దరికి ఉమ్మడి జిల్లాలో బాధ్యతలు!

ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఐఏయస్‌ అధికారులు... ఆ ఇద్దర్నీ పక్కపక్క జిల్లాల కలెక్టర్లుగా ప్రభుత్వ నియమించింది... అలాగే మరో ఇద్దరు భార్యాభర్తలు ఐపీయస్‌ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో విడివిడిగా ఎస్‌పీలు ప్రభుత్వం నియమించింది..

Andhra Pradesh: భలే ఛాన్స్‌ కొట్టేసిన ఐఏయస్‌, ఐపీఎస్ దంపతులు.. భార్య భర్తలిద్దరికి ఉమ్మడి జిల్లాలో బాధ్యతలు!
Prakasam, Bapatla
Balaraju Goud
|

Updated on: Apr 03, 2022 | 8:19 PM

Share

IAS, IPS couple in AP: ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఐఏయస్‌ అధికారులు… ఆ ఇద్దర్నీ పక్కపక్క జిల్లాల కలెక్టర్లుగా ప్రభుత్వ నియమించింది… అలాగే మరో ఇద్దరు భార్యాభర్తలు ఐపీయస్‌ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో విడివిడిగా ఎస్‌పీలు ప్రభుత్వం నియమించింది.. ఇది యాధృచ్చికంగా జరిగినా అరుదైన సంఘటనగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నియామకాలు అటు అధికార వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పలువురు ఐఏయస్‌, ఐపీయస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంతమందికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇదేమంత విశేషం కాదే అనుకుంటున్నారా… ఇక్కడే ఓ విశేషం ఉంది. ఇప్పుడే ఈ బదిలీలే రెండు జిల్లాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రకాశంజిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఎస్‌పీగా పనిచేస్తున్న మలిక గార్గ్‌ను ప్రభుత్వం ప్రకాశంజిల్లాలోనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతవరకు బాగానే ఉంది. అయితే, నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు కలెక్టర్‌గా విజయను ప్రభుత్వం నియమించింది. ఈమె ఎవరోకాదు ప్రకాశంజిల్లా కలెక్టర్‌గా నూతనంగా ప్రభుత్వ నియమించిన దినేష్‌కుమార్‌ సతీమణి. అలాగే, బాపట్ల జిల్లా ఎస్‌పీ వకుల్‌ జిందాల్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రకాశంజిల్లా ఎస్‌పీ మలికగార్గ్‌ భర్త. దీంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా భార్యభర్తలు దినేష్‌కుమార్‌, విజయలు ఉంటే… అదే ప్రకాశం, బాపట్ల జిల్లాల ఎస్‌పీలుగా బార్యాభర్తలు మలికగార్గ్‌, వకుల్‌ జిందాల్‌లు నియమితులయ్యారు.

ప్రకాశం కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ను నియమిస్తూ, ఆయన భార్య విజయకు బాపట్ల జిల్లా కలెక్టర్‌గా అవకాశం కల్పించారు. ప్రకాశంజిల్లా ఎస్పీగా మలికగార్గ్‌ను కొనసాగిస్తూ ఆమె భర్త వకుల్‌జిందాల్‌ను బాపట్ల ఎస్పీగా నియమించారు. ఇప్పటి వరకు ప్రకాశం కలెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌గా నియమించారు. ప్రకాశంజిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన దినేష్‌కుమార్‌ ప్రస్తుతం గుంటూరు జిల్లా జేసీగా ఉన్నారు. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దినేష్‌ కుమార్‌ తొలుత ఆయన 2009లో ఐఆర్‌ఎస్‌కు, ఆ తర్వాత 2013లో ఐఏఎస్‌కు అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సబ్‌కలెక్టర్‌గా, ఆ తర్వాత ఐటీడీఏ పీవోగా, అనంతరం ఫైబర్‌ నెట్‌ ఎండీగా పనిచేశారు. రెండేళ్ల నుంచి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య విజయ కూడా 2013లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమెను ప్రస్తుతం బాపట్ల కలెక్టర్‌గా నియమించారు.

అలాగే, ప్రకాశంజిల్లా ఎస్‌పిగా పనిచేస్తున్న మలికగార్గ్‌ను ప్రభుత్వం ఇక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితేచ ఆమె భర్త, సీఎం సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న వకుల్‌ జిందాల్‌ను బాపట్ల ఎస్పీగా నియమించారు. దీంతో పక్కపక్క జిల్లాలకు భార్యభర్తలు కలెక్టర్లుగా ఉంటే అదే జిల్లాల్లో మరో భార్యభర్తలు ఎస్‌పీలు ఉండటం ఓ అరుదైన సంఘటనగా భావిస్తున్నారు.

—- ఫైరోజ్‌, టీవీ 9 ప్రతినిధి, ఒంగోలు.

Read Also…  Unemployment in India: ఉపాధి రంగంలో శుభవార్త.. మార్చిలో తగ్గిన నిరుద్యోగిత రేటు..!

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట