AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భర్త క్షణికావేశం.. ఎంతటి దారుణానికి రెచ్చగొట్టిందో చూడండి..!

Andhra Pradesh: క్షణికావేశంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింటికి వెళ్లిన భార్య పిలిచిన వెంటనే కాపురానికి రాలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా కత్తితో కడుపులో పొడిచాడు.

Andhra Pradesh: భర్త క్షణికావేశం.. ఎంతటి దారుణానికి రెచ్చగొట్టిందో చూడండి..!
Crime News
Shiva Prajapati
|

Updated on: Oct 25, 2021 | 8:51 PM

Share

Andhra Pradesh: క్షణికావేశంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పుట్టింటికి వెళ్లిన భార్య పిలిచిన వెంటనే కాపురానికి రాలేదనే కారణంతో అత్యంత కిరాతకంగా కత్తితో కడుపులో పొడిచాడు. ఆపై గొంతు కోశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రపద్రేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమల మండలం ఉప్పర పల్లె పంచాయతీ పరిధిలోని మల్లోల పల్లె గ్రామానికి చెందిన భాగ్యశ్రీకి, పూతలపట్టు మండలం దొమ్మాల పల్లెకు చెందిన వెంకటాద్రి అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 9 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, కొంత కాలంగా ఈ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యశ్రీ.. పుట్టింటికి వెళ్లింది. రెండ్రోజులు సైలెంట్‌గా ఉన్న భర్త వెంకటాద్రి ఇవాళ తన బార్య పుట్టింటికి వెళ్లి.. తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా భాగ్యశ్రీని అడిగాడు.

అయితే, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న భాగ్యశ్రీ.. కొద్ది రోజుల తరువాత వస్తానని బదులిచ్చింది. దాంతో కోపోద్రిక్తుడైన వెంకటాద్రి.. ఆ కోపాన్ని మనసులోనే పెట్టుకున్నాడు. బయటకు మాత్రం ఆమెతో ఆనందంగా ఉన్నట్లుగా నవ్వుతూ నటిస్తూ మాట్లాడాడు. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపిస్తానంటూ నమ్మబలికాడు. అది నమ్మిన భాగ్యశ్రీ.. భర్త వెంట బైక్‌పై సోమలకు బయలుదేరింది. అయితే, లోలోపల కోపంతో రగిలిపోతున్న వెంకటాద్రిలోని రాక్షసుడు మార్గం మధ్యలో బయటకు వచ్చాడు. అడుసుపల్లె సమీపంలో బైక్‌ని ఆపి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య భాగ్యశ్రీపై దాడికి దిగాడు. విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. ఆ తరువాత ఆమె గొంతు కోశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భాగ్యశ్రీ.. కేకలు వేసింది. అది విన్న సమీపంలోని రైతులు ఘటనా స్థలానికి చేరుకోగా.. వెంకటాద్రి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వివాహితను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న వెంకటాద్రిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

Also read:

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!

Viral News: అతను మార్వెల్‌ కంటే సూపర్‌ హీరో.. నెటిజన్లు ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్..

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు