Andhra Pradesh: స్నేహితులంతా కలిసి వేటకెళ్లారు.. పందులను చూడగానే పేలిన తూటా.. పాపం చివరికి..

అంతా కలిసి అడవి పందుల వేటకు అడవిలోకి వెళ్లారు. వేట మొదలుపెట్టారు.. దూరం నుంచి అడవి పందులు కూడా కనిపించాయి. అంతే.. చేతిలో ఉన్న తుపాకీ పేలింది.. కానీ ఆ తుటా పందికి తగలలేదు. తమ సహచరుడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఇంకేముంది.. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. మృతదేహాన్ని గ్రామానికి సహచరులు మోసుకొచ్చారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో

Andhra Pradesh: స్నేహితులంతా కలిసి వేటకెళ్లారు.. పందులను చూడగానే పేలిన తూటా.. పాపం చివరికి..
alluri sitarama raju district news
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 13, 2023 | 5:06 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు 13: అంతా కలిసి అడవి పందుల వేటకు అడవిలోకి వెళ్లారు. వేట మొదలుపెట్టారు.. దూరం నుంచి అడవి పందులు కూడా కనిపించాయి. అంతే.. చేతిలో ఉన్న తుపాకీ పేలింది.. కానీ ఆ తుటా పందికి తగలలేదు. తమ సహచరుడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఇంకేముంది.. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. మృతదేహాన్ని గ్రామానికి సహచరులు మోసుకొచ్చారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో అడవిపందుల వేటకు కోసం కాల్చిన తూటా.. గిరిజనుడికి తగిలింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. అందరూ చూస్తుండగానే మరణించాడు ఆ గిరిజనుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అడవిలో జరిగిందిదే..

అల్లూరి జిల్లా ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం కప్పలు గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు.. అడవి పందుల వేట కోసం అడవిలోకి వెళ్లారు. బొంజు బాబు, సుబ్బారావు, సింహాచలం, సూరిబాబు, మల్లన్న వీరంతా అడవిలోకి వెళ్లి పందుల వేట ప్రారంభించారు. ఐదుగురిలో ముగ్గురు ఒకవైపు మరో ఇద్దరూ మరోవైపు వెళ్లారు. పెదబయలు మండలం వనుకొత్తూరు సమీపంలోని రాచకొండమ్మ కొండపై వేట చేస్తున్నారు. వీరిలో సూరిబాబు.. పందులను వెంబడిస్తూ తుపాకీతో కాల్చాడు. ఆ తూటా కాస్త.. అదుపుతప్పి బొజ్జుబాబుకు తగిలింది. దీంతో బుజ్జిబాబు అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

మృతదేహాన్ని గ్రామానికి మోసుకొచ్చి..

వేట చేసిన తర్వాత అడవిపంది కళేబరాన్ని మూసుకొస్తుంటారు. కానీ ఈసారి బొజ్జు బాబు మృతదేహాన్ని సహచరులు.. గ్రామానికి మోసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకున్నారు. నిందితుడు సూరిబాబును అదుపులోకి తీసుకున్నారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాడేరు ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి
Asr News

alluri sitarama raju district

మూడు నాటు తుపాకులు..

కప్పలు గ్రామంలో పోలీసులు మూడు నాటుతూపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నాటు తుపాకీ, ఆయుధాల చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జంతువులను వేటాడటం నేరమని, అలాంటి పనులు మానుకోవాలంటూ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..