Chirala: వల బలంగా అనిపిస్తే పెద్ద.. పెద్ద చేపలు చిక్కాయని ఆనందపడ్డారు.. కానీ సీన్ రివర్స్
తిమింగలాలు సముద్రం మధ్యలో లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. టన్నుల పరిమాణంలో ఉండే ఇవి సముద్రం ఒడ్డున అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి... తిమింగలాలు ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని సార్లు వాంతి చేసుకుంటాయి. దీన్ని అంబర్ గ్రీస్ అంటారు. దీనికి అంతర్జాయతీ మార్కెట్లో చాలా విలువ ఉంటుంది. వెయిట్‌ను బట్టి కోట్లలో ధర పలుకుతుంది. అంబర్ గ్రీస్ మత్స్యకారుల వలకు చిక్కితే వారి పంట పండినట్టే. ఎంతో విలువైన తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు.
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16: బాపట్ల జిల్లా చీరాల వాడరేవు సముద్ర తీరంలో మత్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అయితే దీన్ని మార్కెట్‌లో ఎవరు తినరు… కొనరు. దీంతో ఈ తిమింగలాన్ని ఏం చేయాలో అర్దంకాక తిరిగి సముద్రంలోనే విడిచిపెట్టేందుకు మత్య్సకారులు సిద్దమయ్యారు. అయితే వల నుంచి ఈ భారీ తిమింగలాన్ని తప్పించేందుకు మత్యకారులు నానా అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంకు చెందిన కొందరు మత్యకారుల కోన వల సహాయంతో వేట సాగిస్తుండగా 500 కిలోల బరువు వుండే భారీ తిమిగలం వలకు చిక్కింది. వెంటనే గమనించిన మత్యకారులు సముద్రంలో ఆ తిమింగలాన్ని వదిలించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు… ఇక చేసేది లేక వాడరేవు తీరానికి చేరుకొని ఆ తిమింగలాన్ని నానా తంటాలు పడి వదిలించుకున్నారు. అప్పటికీ ఆ తిమింగలం బతికే వుండటంతో అతి కష్టం మీద మత్యకారులు తిరిగి సముద్రంలోని వదిలేశారు. కాగా తిమింగలం ధాటికి మత్యకారుల వల పూర్తిగా ధ్వసంమైపోయింది. వల దెబ్బతినడం వలన 30 వేల రూపాయల వరకు నష్టం వాటిలినట్లు మత్యకారులు వాపోతున్నారు.
తిమింగలం వాంతి చిక్కి ఉంటే కోట్లు వచ్చి ఉండేవి…
తిమింగలాలు సముద్రం మధ్యలో లోతైన ప్రాంతంలో సంచరిస్తుంటాయి. టన్నుల పరిమాణంలో ఉండే ఇవి సముద్రం ఒడ్డున అరుదుగా మాత్రమే కనిపిస్తుంటాయి… తిమింగలాలు ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని సార్లు వాంతి చేసుకుంటాయి. దీన్ని అంబర్ గ్రీస్ అంటారు. దీనికి అంతర్జాయతీ మార్కెట్లో చాలా విలువ ఉంటుంది. వెయిట్‌ను బట్టి కోట్లలో ధర పలుకుతుంది. అంబర్ గ్రీస్ మత్స్యకారుల వలకు చిక్కితే వారి పంట పండినట్టే. ఎంతో విలువైన తిమింగలం వాంతిని సముద్రంలో తేలే బంగారం అంటారు. తిమింగలాలు స్క్విడ్‌ని మింగుతాయి. అవి దాని పొట్టలోకి వెళ్లిన తర్వాత ఆంబ్రెయిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. దాంతో స్క్విడ్ ముక్కలై ముద్దలా మారిపోతుంది. ఆ సమయంలో తిమింగలం దాన్ని కక్కితే… అదే వాంతిగా నీటిపై తేలుతుంది. నీటిలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి కొవ్వొత్తిలా మారిపోతుంది. అలా మారిన దాన్ని అంబర్‌గ్రిస్ అంటారు.
ఈ అంబెర్‌గ్రిస్ సువాసన వెదజల్లుతుంది. అందువల్ల దాన్ని పెర్‌ఫ్యూమ్స్ తయారీలో వినియోగిస్తారు… అందువల్ల దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ గిరాకీ ఉంది… ప్రస్తుతం వాడరేవు సముద్రంలో తిమింగలానికి బదులు దాని వాంతి చిక్కి ఉంటే మత్స్యకారులు పంట పండి ఉండేది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..