Andhra Pradesh: మరో గుడ్ న్యూస్.. ఏపీలో మందుషాపుల టైమింగ్స్ ఇవే..
ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. మరోవైపు మద్యం షాపుల పనివేళల విషయమంలో కూడా స్పష్టత ఇచ్చింది.
ఏపీలో మందుబాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే క్వాలిటీ మద్యం ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు. లాటరీ పద్ధతిలో కొత్త మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రూ 2లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లైసెన్సులు దక్కినవారికి షాపు రన్ చేసేందుకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే కల్లు గీత కులాలకు మద్యం షాపుల లైసెన్సుల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. లక్కీ డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు ఉంటుంది. ఓనర్‌కి 20% ప్రాఫిట్ లభిస్తుంది. జనాభాను బట్టి షాపుల సంఖ్య నిర్ణయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియమ్ లిక్కర్ షాపుల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ షాపులకు కోటి రూపాయలను ఫీజుగా.. నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ రూ 15 లక్షలు నిర్ణయించారు.
ఏపీ నూతన మద్యం పాలసీపై మంత్రి పార్థసారధి ఏమన్నారో దిగువన చూడండి..
మద్యం షాపుల లైసెన్సుల రిజర్వేషన్లపై మంత్రి ఏమన్నారో దిగువన చూడండి..