AP Rains: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ ఆ జిల్లాలకే ముప్పు
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ కీలక సూచన చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ కీలక సూచన చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal), భూమధ్యరేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంలో బంగాళాఖాతంలో అల్పపీడనం (Low pressure) ఏర్పడింది. గురువారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండం బలపడే అవకాశముందని అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయి తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 4 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గురు, శుక్రవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 4 నుంచి 7 వరకు అక్కడక్కడా వానలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అత్యవసరమైతే తప్ప..
ఇంట్లో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పేర్కొంది. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. గతేడాది నవంబర్ లో జరిగిన వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తీరం వెంబడి 45నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Depression over southwest BoB and adjoining Equatorial Indian Ocean about 820 km south-southeast of Puducherry (TamilNadu).To intensify further into a DD in 24 https://t.co/83HTlHnJJU move northwestwards along and off east coast of SriLanka towards north TN Coast in next 48 hrs. pic.twitter.com/JVjjACCXQQ
— India Meteorological Department (@Indiametdept) March 3, 2022
గతేడాది నవంబర్‌లో వర్ష బీభత్సం..
గతేడాది నవంబర్‌లో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో 24 మంది మృతి చెందారు. భారీ వర్షాలతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి ప్రభుత్వం కుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సహాయం అందించింది. తిరుపతిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. రక్షణ గోడలు దెబ్బతిన్నాయి.
ఇవి కూడా చదవండి: Blood Sugar: వేసవిలో డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 5 పండ్లను తినండి..
Summer Tips: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఎందుకు మంచిది.. తెలిస్తే షాక్ అవుతారు..
