AP Weather: ఏపీకి రెయిన్ అలర్ట్… ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది.

AP Weather: ఏపీకి రెయిన్ అలర్ట్... ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
Ap Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2021 | 10:03 PM

ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. శనివారం ఉదయానికి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖ,  అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కాగా తమిళనాడు-శ్రీలంక తీరాలను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కాసేపు వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గుంటూరు మూడు వంతెనల కూడలి వద్ద వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు కాసేపు ఇబ్బంది కలిగింది. ఒంగోలు పట్టణంలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధుల్లో వరద నీరు చేరింది. గాంధీ రోడ్డు, బస్టాండ్ రోడ్డు, సుజాతనగర్, కర్నూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా కురుస్తోన్న వర్షాలకు భైరవకోన జలపాతం వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది.

Also Read: Siddharth Kaushal: సినిమాను తలపిస్తున్న సీన్.. వేల మంది రౌడీషీటర్లకు ఎస్పీ డైరెక్ట్ వార్నింగ్

గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్