Andhra Pradesh: పోలవరానికి పోటెత్తుతున్న వరద.. ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి అంబటి..
Andhra Pradesh: పోలవరం వరద ఉధృతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన..
Andhra Pradesh: పోలవరం వరద ఉధృతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం దగ్గర ఇప్పుడు 25లక్షల క్యూసెక్కులను మించిన వరద కనిపిస్తోందన్నారు. కాఫర్ డ్యామ్ అన్నిగేట్లు ఎత్తి నీటిని వదులుతున్నా.. పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉందన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాపర్ డ్యామ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని చెబుతున్నారు అంబటి రాంబాబు. అందుకే పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే లోయర్ కాపర్ డ్యాం మునిగిపోవడం.. డయాఫ్రం వాల్ పైన వాటర్ ప్రవేశించడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఎగువ నుండి భారీ స్థాయిలో వరద నీటి ప్రవాహం వస్తోందని, పోలవరం వద్ద 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా అప్పర్ కాపర్ డ్యాం తట్టుకోగలదని తెలిపారు. అంతకంటే ఎక్కువైతే ఇబ్బందికర పరిస్థితి ఎర్పడుతుందన్నారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..