AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇంటి ముందు గుమ్మడి కాయలు కడతారు … కానీ ఛైర్మెన్ గారు మాత్రం..

పశ్చిమగోదావరి భీమవరంలో ఏపీ శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఇంటి ఆవరణలో వేలాడుతున్న భారీ బూడిద గుమ్మడికాయలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. పందిరి కట్టి ప్రత్యేకంగా పెంచిన ఈ గుమ్మడికాయలు దిష్టి తగలకుండా మాత్రమే కాదు.. ఔషధ గుణాలతో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వడియాలు, స్వీట్లు, కూరలు, జ్యూస్ తయారీలో ఉపయోగించే బూడిద గుమ్మడి కడుపు ఉబ్బరం, మలబద్ధకం, బీపీ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

Andhra: ఇంటి ముందు గుమ్మడి కాయలు కడతారు ... కానీ ఛైర్మెన్ గారు మాత్రం..
Ash Gourd
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 29, 2025 | 1:45 PM

Share

వీరి వీరి గుమ్మడి వీరి పేరేంటి.. ఈ ఆట గుర్తుందా. ఇదిగో ఇపుడు ఈ పాదు చూస్తే శాసనమండలి ఛైర్మెన్ మోషేను రాజు పేరు గుర్తుకు వస్తుంది. రైతులు బూడిద గుమ్మడిని పొలంలో పెంచుతారు. లేదంటే ఇంటి వెనక పెరట్లో పెడతారు. ఇది తీగజాతి కావటంతో పొలంలో అయినా , ఇళ్ల మధ్య అయినా అది అల్లుకుంటూ పొదలా పెరిగి కాయలు కాస్తుంది. ఐతే దీనికి పందిరి కట్టి పెంచటం అరుదు. అందుకు ప్రధాన కారణం బూడిద గుమ్మడి కాయలు బరువుగా ఉండటం చేత.. ఆ తీగ ఆ బరువును మోయలేదు. ఐతే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఇంటి ఆవరణలో వేలాడుతున్న భారీ బూడిద గుమ్మడికాయలు ఇపుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇంటి దగ్గర పెంచిన బూడిద గుమ్మడికాయలు దిష్టికే కాదు.. ఆ ఇంటి అందాన్ని మరింతగా పెంచేసాయి. బూడిద గుమ్మడికాయలు అనేవి గుమ్మడి జాతిలో ఒక రకం. వీటిని దిష్టి తగలకుండా ఉండేందుకు ఇంటి ముందు వేలాడేలా కట్టడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా వడియాలు పెట్టడానికి, కొన్ని స్వీట్ తయారు చేయడానికి, కొన్ని రకాల కూరలు వండడానికి, పచ్చడి వాడతారు. ఇక ఈ మధ్య బూడిద గుమ్మడి జ్యూస్‌కు కూడా డిమాండ్ పెరిగింది.

బూడిద గుమ్మడికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బూడిద గుమ్మడికాయలు సాధారణంగా ఆరు కిలోల వరకూ బరువు పెరుగుతాయి . గుమ్మడికాయ పాదులోనూ, కాయలోనూ, గింజలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. కడుపు ఉబ్బరం, మంట, అతి దాహంను బూడిద గుమ్మడికాయ నివారిస్తుంది. జీర్ణశక్తికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. బిపీ, నిద్రలేమిని నియంత్రిస్తుంది. ఇంత విశిష్టమైన బూ-డిద గుమ్మడికాయ అంటే తెలియని వారు ఉండరు. బూడిద గుమ్మడికాయలలో ఉన్న వైద్య గుణాలను బట్టి వైద్య కుష్మాండం, వైద్య కంబళం అని కూడా అంటారు.

ఇక ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఇంటి ఆవరణలో ఉన్న బూడిద గుమ్మడికాయలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక శద్దలో పందిరి వేయించి కాయలకు బలంగా ఉండేందుకు ఉట్టిలను కట్టించారు. పదుల సంఖ్యలో భారీ సైజులో గుమ్మడి కాయాలు ఆకాశం నుంచి వేలాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మోషేన్ రాజు ఇంటికి వచ్చేవారిని, చుట్టుపక్కల వారిని ఈ గుమ్మడికాయలు ఇపుడు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.